ఆర్టీసీ డ్రైవర్లకు షాక్, తాజా ఉత్తర్వులతో - ఇక నుంచి..!!
ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్ లను నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని 11 రీజియన్లలో ఒక్కో డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ప్రమాదాల నివారణ... భద్రతలతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. డ్రైవర్ కు అత్యవసరం అయితే కండెక్టర్ నెంబర్ తో మాట్లాడించే వెసులుబాటు కల్పించారు.
తెలంగాణ ఆర్టీసీ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఒక డ్యూటీల్లో ఉన్న డ్రైవర్లు మొబైల్ ఫోన్లు వాడటాన్ని నిషేధించింది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయించింది. ఇందు కోసం కొన్ని డిపోలను ఎంపిక చేసింది. ఫరూక్‌నగర్ (హైదరాబాద్), కూకట్‌పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్‌నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్గొండ), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), పరకాల (వరంగల్) లో ఈ విధానం ముందుగా అమలు చేయనున్నారు. ఆ తరువాత ఫలితాల మేరకు దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేస్తారు.

ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసారు. డ్రైవరు విధుల్లో చేరేముందు తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి, డిపోలోని సెక్యూరిటీ అధికారి (కార్యాలయం) వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విధులు ముగించుకునే ముందు తిరిగి తీసుకోవాలి. ఇంటి నుంచి కానీ, అత్యవసర సమయాల్లో సంబంధిత డ్రైవర్‌కు సమాచారం అందించడానికి డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్ నంబరును అందుబాటులో పెడతారు. ఆ నంబరుకు కాల్ చేసి సమాచారం ఇస్తే సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్‌తో మాట్లాడిస్తారు. కొంత మంది డ్రైవర్ల తీరుతో నష్టాలు జరుగుతున్నాయని.. దీంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు సంస్థ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications