పండుగ వేళ రూటు మార్చిన ఆర్టీసీ - బూమ్ రాంగ్..!!
సంక్రాంతి వేళ పట్టణాలు పల్లె బాట పట్టాయి. ప్రయాణాల రద్దీకి అనుగుణంగా రైల్వే, ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసాయి. అయినా, సొంత వాహనాల్లో వెళ్తున్న వారితో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. అటు ప్రయివేటు బస్సులు ఇదే అదనుగా భారీగా ధరలు పెంచి నడుపుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో, ఆశించిన స్థాయిలో స్పందన రావటం లేదు. ధరలు తక్కువగా ఉన్న సర్వీసుల వైపు ప్రయాణీకు లు మొగ్గు చూపుతున్నారు.
పండుగ స్పెషల్
సంక్రాంతికి ప్రయాణికుల కోసం టీజీఎస్ ఆర్టీసీ 6,432 బస్సులను నడుపుతుండగా.. ఏపీఎస్ ఆర్టీసీ 7,200 బస్సులను నడుపుతుంది. ఇందులో ఎక్కువ సంఖ్యలో బస్సులు హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఈ నెల 11,12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచారు. సాధారణ ఛార్జీలున్న బస్సులు తక్కువగా నడపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

పెరిగిన ఛార్జీలతో
అటు ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తుండటంతో.. ప్రయాణీకులు ఆ సంస్థ బస్సుల కే ప్రాధాన్యత ఇస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం చేసుకోవలంటే ప్రత్యేక బస్సుల్లో 30 నుంచి 50 శాతం అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సులో సాధారణ ధర 440 ఉండగా స్పెషల్ బస్సులో గరిష్టంగా 660 ఉంది. హైదరాబాద్ నుంచి ఊర్లకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో ప్రస్తుత చార్జీపై 50 శాతం వరకు టికెట్ల రేట్లు పెరిగాయి. సాధారణ ఛార్జీలతో బస్సులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.

విమానాలకు డిమాండ్
ఇదే సమయంలో ప్రయివేటు ఆపరేటర్లు ఛార్జీలు ఇష్టా రాజ్యంగా వసూలు చేస్తున్నారు. హైదరా బాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల చార్జీలు భారీగా పెంచారు. రాజమండ్రికి గరిష్టంగా రూ. 4వేలు, విశాఖ పట్నంకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు గరిష్టంగా రూ.5,000వేల నుంచి 6,000వేలకు టికెట్ ఛార్జీలు ఉన్నాయి. దీంతో, ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే విమానాలు చార్జీలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన చార్జీలు రూ.14 వేలు ఉండగా, రాజమండ్రికి రూ.22 వేలు ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications