ఆ పంటతో డబుల్ ఆదాయం.. రికార్డ్ ధరతో సంతోషంలో రైతులు!
మిర్చి సాగు చేసిన రైతుల పంట పండుతుంది. తాజాగా గుంటూరు మార్కెట్ యార్డ్ లో కారప్పొడి చేసే మిర్చికి 23వేల రూపాయల రికార్డ్ ధర పలకగా, తాజాగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పసుపు రంగు మిర్చికి రికార్డ్ ధర పలికింది. అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పసుపు మిర్చి ధర ఏకంగా 44000 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది.
పసుపు మిర్చి రికార్డు ధర
కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరిగిందని, నిన్నటి వరకు 42,500 క్వింటాల్ పసుపు మిర్చి ధర ఉందని ఒకరోజు వ్యవధిలోనే 1500 రూపాయలు పెరిగి 44 వేల రూపాయలకు చేరిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్కు పంట దిగుబడి తక్కువగా రావడంతో, దిగుబడి తగిన వేళ పసుపు మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు.

పసుపు మిర్చి ధరల పెరుగుదలకు కారణం ఇదే
అసాధారణంగా పసుపు మిర్చి ధరలు పెరగడానికి వాతావరణంలో మార్పులు, తగ్గిన దిగుబడి కారణమని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా మిర్చి తోటలు దెబ్బతిన్నాయని, గతంతో పోలిస్తే పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో ధర విపరీతంగా పెరిగిందని అంటున్నారు.
పసుపు మిర్చి విక్రయాలకు ఎనుమాముల ఫేమస్
గత సంవత్సరం పసుపు మిర్చి ధర క్వింటాలుకు కేవలం 16 వేల రూపాయల నుంచి 17 వేల రూపాయల మధ్య ఉందని, కానీ ఈసారి రెండు రెట్లకు పైగా అని పెరిగిందని అంటున్నారు.
వరంగల్ తో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కృష్ణ వంటి ఇతర జిల్లాల రైతులు తమ పంటను ఇక్కడ మార్కెట్ కు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతూ ఉంటారు.
రికార్డు ధరతో పసుపు మిర్చి రైతుల్లో సంతోషం
ఎకరానికి లక్ష రూపాయల నుంచి 150000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గినప్పటికీ, ధర విపరీతంగా పెరగడంతో కాస్త ఊరట లభిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా పసుపు మిర్చిని నమ్ముకుని సాగు చేస్తున్న రైతులు ఈసారి రికార్డు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం మిర్చి రైతులకు అటు ఏపీ లోను ఇటు తెలంగాణలోనూ ఈసారి రికార్డు ధరలు రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications