రైతుల కోసం కేంద్రం కీలక హెచ్చరిక.. వారికి 50లక్షల ఫైన్, 5ఏళ్ళ జైలుశిక్ష!
రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. అందులో భాగంగా కేంద్రం తాజాగా పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025 ముసాయిదా విడుదల చేసింది. దీంతో నకిలీ పురుగుమందులకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. నకిలీ పురుగు మందుల వాడకం, విక్రయాలపైన తీవ్ర హెచ్చరిక జారీ చేసిన కేంద్రం నకిలీ ఉత్పత్తులు అమ్మినా, వాడినా నేరంగా చెప్తోంది.
అలా చేస్తే 50లక్షల జరిమానా
రైతులు నకిలీ ఉత్పత్తులను వినియోగించినా, షాపు యజమానులు అమ్మినా రూ. 50 లక్షల వరకు జరిమానా, లేదా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పెరుగుతున్న పురుగు మందుల వాడకంతో పంటలు, పర్యావరణం దెబ్బతిని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.

ముసాయుదాపై ప్రజల నుండి అభిప్రాయాలను కోరిన కేంద్రం
'పురుగు మందుల నిర్వహణ బిల్లు, 2025' ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం ఈ ముసాయుదాపై ప్రజల నుండి అభిప్రాయాలను ఫిబ్రవరి 4వ తేదీ లోపు కోరుతోంది. గత ఏడాది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో మాట్లాడినప్పుడు రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల కారణంగా తమకు కలుగుతున్న ఇబ్బందిపై మంత్రికి తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న లోపాలు ఉన్నా సరే భారీ జరిమానాలు విధించే అవకాశం
నాసిరకం ఉత్పత్తులపై ప్రభుత్వానికి రైతుల నుండి ఫిర్యాదులు రావటంతో కేంద్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ వ్యవసాయ శాఖాధికారులకు చిన్న లోపాలు ఉన్నా సరే భారీ జరిమానాలు విధించే అధికారాన్ని కల్పిస్తుంది. దీంతో దుకాణం దారులలో ఆందోళన కనిపిస్తుంది.
కేంద్రం కఠిన చర్యలతో రైతులు ఇబ్బంది పడే అవకాశం
అయితే ఈ బిల్లుతో నకిలీ నివారణకు కేంద్రం కఠిన చట్టాలను తెచ్చినా, నకిలీ, అసలు పురుగుమందులు, విత్తనాలను రైతులు ఎలా గుర్తిస్తారు అనే చర్చ జరుగుతుంది. అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు అంటే అది రైతులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పురుగుమందుల షాపుల నిర్వాహకులకు బిగ్ షాక్
పురుగుమందుల షాపుల నిర్వహకులపైనే చర్యలు తీసుకునేలా చూస్తే రైతు దాకా నకిలీ ఉత్పత్తులు చేరవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పురుగుమందుల షాపుల నిర్వాహకులకు పెద్ద హెచ్చరిక అనే చెప్పాలి. రైతులకు లబ్ది చేకూరుస్తుంది అనే చెప్పాలి. భూసారాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడి, రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుంది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications