Entrance Exams: తెలంగాణలో ఏ ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..!

మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు.

తెలంగాణలో పలు కోర్సులకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదలయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించి తేదీలను ప్రకటించారు. ఎంసెట్‌ పరీక్షను మే 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్రవరి 7న తన కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులతో సమావేశమై ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు.

ఈసారి పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ను 4 రోజుల పాటు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్‌ కన్వీనర్లు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మార్చి మొదటి వారంలో ఎంసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్, పీజీఈసెట్‌లను జేఎన్‌టీయూహెచ్‌, ఈసెట్, లాసెట్‌లను ఓయూ, ఎడ్‌సెట్‌ను మహాత్మాగాంధీ వర్సిటీ, ఐసెట్‌ను కాకతీయ వర్సిటీలు నిర్వహించనున్నాయి.

The dates of the entrance exams conducted for various courses in Telangana have been announced

మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18న ఎడ్ సెట్, మే 20 ఈసెట్, మే 25న లాసెట్‌, మే 26, 27 తేదీల్లో ఐసెట్‌, మే 29, 30, 31, జూన్‌ 1 తేదీల్లో పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించన్నారు. ప్రవేశ పరీక్షల అనంతరం ఫలితాలు ప్రకటించి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+