విద్యార్థుల భవిత అంధకారం!పేపర్ లీకేజీలే తెలంగాణ మోడలా?పాలమూరు నిరుద్యోగ ర్యాలీలో రేవంత్ గర్జన.!
మహబూబ్ నగర్/హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబం భూములు, కాంట్రాక్టర్ల పేరిట కోట్లాది రూపాయాలను కొల్లగొడుతున్నారని, ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారని పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రావు దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్ ఇదేనా?అని రేవంత్ రెడ్డి గులాబీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్లో మెట్టుగడ్డ నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ప్రశ్నపత్రాలను అమ్ముకోవడమేనా తెలంగాణ మోడలా?:పాలమూరు బిడ్డలు కష్టజీవులని, కష్టాన్ని నమ్ముకుని జీవించే వారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంలో పాలమూరు బిడ్డల కష్టం ఉందని ఆయన అన్నారు. కృష్ణా, తుంగభద్ర నీళ్లతో తడిసిన నేల పాలమూరు జిల్లా అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, మహేంద్రనాథ్ మన పాలమూరు బిడ్డలే అని ఆయన గుర్తు చేసారు.

కేసీఆర్ కు రాజకీయ బిక్షపెట్టింది పాలమూరు జిల్లా..:జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని, 2009లో కరీంనగర్ ప్రజలు బోంద పెడ్తరని భయడి పాలమూరుకు వస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి చంద్రశేఖర్ రావుకు రాజకీయ భిక్ష పెట్టారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని సీఎం మాట ఇచ్చారని, మరి తొమ్మిదేళ్లయినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్ధిపేటలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ కట్టి పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేయలేదని, పాలమూరు జిల్లా ఏవిధంగా నిర్లక్ష్యానికి గురైందో ఒక్కసారి ఆలోచించండి అని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ..:2010లో అలంపూర్ ప్రాంతంలో వరదలు వస్తే బంజారాహిల్స్ లోని తన ఇళ్లు అమ్మి అయిన వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తా అని మాట ఇచ్చారని, ఒక్క ఇంటిని కూడా కట్టి ఇయ్యలేదు అని రేవంత్ రెడ్డి చంద్రశేఖర్ రావును విమర్శించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది చనిపోయినా తెలంగాణ రాలేవు గానీ 2000లో చిన్నారెడ్డి నేతృత్వంలో 42 మంది శాసనసభ సభ్యులు సోనియా గాంధీకి తెలంగాణ కావాలని వినతి పత్రం ఇచ్చారన్నారు రేవంత్. అప్పుడు వనపర్తిలో సభ నిర్వహిస్తే 10 వేల మంది కూడా రారు అనుకుంటే 50 వేల మందికి పైగా వచ్చారని,ఇది చూసి 2001లో చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమం చేస్తే ఓట్లు వస్తాయని ఆశ మొదలైందని రేవంత్ రెడ్డి అన్నారు.

సచివాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదు.. :తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ''నూతన సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం, కానీ.. ఎక్కడ కూడా తెలంగాణ సీఎంవో ప్రోటోకాల్ నిబంధనలను పాటించలేదు'' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గుదేల్చి.. దోషులను కఠినంగా శిక్షిస్తామని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications