ఐఏఎంసీ పై ప్రపంచ దృష్టి -సీజేఐ ఎన్వీ రమణ : దేశంలోనే తొలి కేంద్రంగా - సీఎం కేసీఆర్..!!

దేశంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు అయింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ప్రారంభించారు. నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ను ముఖ్యమంత్రి కేసీఆర్.. జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా.. హైదరాబాద్ లో ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైంది.

దేశంలోనే తొలి సెంటర్ గా

దేశంలోనే తొలి సెంటర్ గా

ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలో సొంత భవనం నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. తక్కువ కాలంలోనే మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటు అయిందని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమని..దీని ద్వారా రాజీ - మధ్య వర్తిత్వం మరింత సులువుగా మారుతుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా హైదరాబాద్ ఎదుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం కేసీఆర్ ప్రశంసలు

హైద‌రాబాద్‌ను అతిగా ప్రేమించే వ్య‌క్తుల్లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఒక‌రని పేర్కొన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన‌టువంటి ప్ర‌క్రియ‌లో అనేక కార‌ణాల చేత కోర్టుల‌లో ప‌రిష్కారం కానీ కేసులు, ఆర్బిట్రేషన్ సెంట‌ర్ల‌లో ప‌రిష్కారాలు ల‌భ్య‌మ‌వుతుండ‌టం ఈ కేంద్రం ప్రత్యేకతగా సీఎం చెప్పుకొచ్చారు. త‌ప్ప‌కుండా ఈ సెంట‌ర్ అన్ని విధాలుగా ముందుకు పురోగ‌మిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. కంపెనీలు, పెట్టుబ‌డిదారుల మ‌ధ్య వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డం ఈ సెంట‌ర్ ల‌క్ష్యం.

రాజీ - మధ్యవర్తిత్వం తో పరిష్కారాలు

రాజీ - మధ్యవర్తిత్వం తో పరిష్కారాలు

రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను హృద‌య‌పూర్వ‌కంగా, చేతులు జోడించి అభినందిస్తున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూమి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పలువురు సుప్రీం - హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+