ధాన్యం కొనుగోలు సమస్యను సృష్టించింది ప్రభుత్వమే.!కేసీఆర్ సర్కార్ కు చావుడప్పు కొట్టాలన్న భట్టి.!
హైదరాబాద్ : చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్న టిఆర్ఎస్ సర్కార్ చావు డప్పును ఊరూరా మోగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి, కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణలో పోరాటం చేస్తున్నట్టు రైతులను మభ్య పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉరూరా మోడీది చావు డప్పు మోగించిన చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఎందుకు ఆందోళన చేయడం లేదని భట్టి ప్రశ్నించారు.

టిఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనాల్సిందే.. లేకపోతే చావు డప్ఫు కొట్టాల్సిందేనన్న భట్టి విక్రమార్క
ప్రధాని మోడీని చూస్తే చంద్రశేఖర్ రావు కు ఏమైనా భయం వేస్తుందా భట్టి విక్రమార్క అని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ లేకుండా రాష్ట్రం నుంచి మంత్రులు, ఎంపీల బృందాన్ని ఢిల్లీ కి పంపించడం వెనుక కేంద్రంతో శరణుకోరే ప్రయత్నంలో భాగమేనా అని భట్టి సందేహం వ్యక్తం చేసారు. కేంద్ర మంత్రులు అందుబాటులో ఉండరని తెలిసి, పార్లమెంటు సమావేశాలు లేని సమయమైన శని, ఆదివారాల్లో మంత్రులు, ఎంపీల బృందం ఎవరిని కలుద్దామని ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. రైతుల సమస్య పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ బృందం ముందుగానే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకునేవారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తో టీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో కొట్లాడుతుందని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే సీఎం చంద్రశేఖర్ రావు పథకం ప్రకారం ఢిల్లీకి తాను వెళ్లకుండా మంత్రుల బృందాన్ని పంపించి రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

కేంద్రంతో పోరాడుతున్నట్టు బిల్డప్ అవసరం లేదు... రైతులు అన్నీ గమనిస్తున్నారన్న సీఎల్పీ నేత
కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాల్సిన ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖర్ రావు ఊరూరా ప్రధాని మోడీది చావు డప్పు మోగిస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని నిలదీశారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజల వాణిని వినిపించాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు సమావేశాలను బహిష్కరించి దిక్కులు చూడడం సరికాదన్నారు. వెంటనే పార్లమెంటు సమావేశాలకు హాజరై రైతుల సమస్యపైన కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకూ పార్లమెంటు వేదికగా పోరాటం చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో యుద్దం చేయాల్సిన చంద్రశేఖర్ రావు వచ్చే యాసంగిలో కిలో వడ్లు కూడా కొనమని ప్రకటించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కిలో వడ్లు కూడా కొనని పాలకులు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చెయ్యాలి.. మోడీ చావు డప్పుతో సమస్య పరిష్కారమైందా అన్న భట్టి
తెలంగాణలో వరి సాగు చేయాల్సిన అవసరం లేనప్పుడు 86 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించినట్లు అని నిలదీశారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి, మూసి, మంజీర తదితర నదుల ప్రాజెక్టుల కింద పుష్కలంగా నీరు ఉన్నప్పుడు రైతులను వరి సాగు చేయొద్దని ప్రకటించడం సమంజసం కాదన్నారు. వరి కాకుండా ఏం పంట వేయాలి? నీళ్లు పుష్కలంగా ఉన్నచోట ఏం పంట పండుతుంది? ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలని సూచిస్తున్నారు? వాటికి అందించే నాణ్యమైన విత్తనాల, ఎరువుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం అందించే సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఏంటి? మీరు చెప్పిన పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెటింగ్ అవకాశం ఉందా? పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారా? ఇలాంటి విషయాలపై స్పష్టత ఇవ్వకుండా వరి సాగు చేయొద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించడం అర్థరహితంగా ఉందని అన్నారు.
Recommended Video

ఊసరవెల్లి రంగులు మార్చుతున్న సీఎం.. పూటకో మాట చెప్తూ మభ్యపెడుతున్నారన్న భట్టి విక్రమార్క
తెలంగాణలో 25.64 లక్షల బోర్ల కింద సాగు అవుతున్న 46 లక్షల ఎకరాలను బీడు భూములుగా మార్చొద్దని సూచించారు. గతేడాది దొడ్డు రకం వరి సాగు చేయొద్దని సన్నరకం సాగు చేయాలని చెప్పి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండ సీఎం చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట తప్పడం వల్ల రైతులు సన్నరకం ధాన్యాన్ని దొడ్డు రకం డబ్బుల కిందకి అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఏడాది క్రితం పత్తి పంట సాగు లాభాలు లేవని, కంది పంట వేసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో కంది రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా సీఎం చంద్రశేఖర్ రావు పూటకో మాట మాట్లాడటం వల్ల రైతులు తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించుకోని పట్టణాలకు వలస కార్మికులుగా వెళ్లే దుస్థితిని తీసుకువస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications