వారికి తెలంగాణా ప్రభుత్వం శుభవార్త..ఉచిత పంపిణీ!
తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంది. వివిధ రకాల పథకాలను అందజేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి దోహదం చేస్తుంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ
దీనిపైన మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలుచేసే క్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి 123 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ బృహత్తర పథకం అమలును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతీ ఊరిలోనూ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపటం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని, ఈ క్రమంలో అధికారుల పాత్ర చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఊరిలోనూ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
డిజిటల్ విధానంలో అన్ని వివరాలు
ప్రతి చెరువు వద్ద పథకం యొక్క వివరాలు, పథకం లక్ష్యాలు, విడుదల చేసిన చేపపిల్లల సంఖ్య వంటి సమగ్ర సమాచారం తెలియజేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ పంపిణీ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ విధానంలోకి తీసుకువస్తూ టి మత్స్య యాప్ లోకి అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ పథకంపైన ప్రజలలో కూడా అవగాహన పెంచాలని, ఇవి ఎటువంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా పథకం అమలును తెలియజేస్తాయని అన్నారు.
వారికి రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాలు
అంతేకాదు చేప పిల్లల పంపిణీ తో పాటు, చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ పైన కూడా దృష్టి సారించిన మంత్రి మత్స్యకారుల కోసం వారి చేపలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో రిటైల్ అవుట్లెట్ ల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే వారికి కేటాయించాలని సూచించారు.
వినియోగదారులకు నేరుగా నాణ్యమైన చేపలు
ఈ రిటైల్ అవుట్లెట్ ద్వారా మత్స్యకారులకు మెరుగైన ధర లభిస్తుందని, వినియోగదారులకు నేరుగా నాణ్యమైన చేపలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications