Telangana: రైతులకు శుభవార్త.. నేరుగా ఖాతాల్లోకే బోనస్ డబ్బులు..!

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు పలు హామీలు ఇచ్చింది. ఇందులో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఉన్నాయి. ఇందులో రుణ మాఫీ అందరికీ చేయలేదు. ఇక రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదు. తాజాగా వడ్ల కొనుగోలు, వడ్లకు సంబంధించి రూ.500 బోనస్ పై మంత్రి వర్గ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డి నివేదిక ఇవ్వనుంది. నివేదిక సిద్ధమైనట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

26వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లపై బ్యాంకు గ్యారంటీతో పాటు మిల్లింగ్ చార్జీలు పెంచడం వంటి అంశాలు నివేదికలో ఉన్నట్లు ఉత్తమ్ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్, ఐసీడీఎస్ పథకాల కింద పంపిణీ చేయడానికి సంబంధించిన సన్న బియ్యంపై చర్చించినట్లు వివరించారు. మిల్లర్లతో పలు దఫాలుగా సమావేశమై నివేదిక తయారు చేసినట్లు పేర్కొన్నారు.

The government has said that the bonus given to the farmers will be directly deposited in the farmers accounts

రూ.500 బోనస్ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ కు ఈ కుబేర్ ప్లాట్​ ఫామ్ ద్వారా బోనస్ డబ్బులు జమ చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇవ్వగా.. ప్రస్తుతం సన్న వడ్లకు మాత్రమే రూ.500 ఇవ్వనున్నట్లు పేర్కొంది. బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతే కాదు రైతు రుణ మాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రుణ మాఫీ కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుర్తు చేశాయి. రుణ మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం ప్రకటన చేయాలని.. ఎప్పటిలోగా రుణ మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశాయి. వర్షాకాలం సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారో చెప్పాలన్నారు. హామీలు ఇవ్వడమే కాదు అమలు కూడా చేయాలని చురకలు అంటిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+