High Court: హైకోర్టులో సిట్‍కు చుక్కెదురు.. రివిజన్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం..
ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన కేసులో సిట్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది. బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు ఏసీబీ కోర్టు తీర్పును సమర్ధించింది. సిట్ రివిజన్ పిటిషన్ ను కొట్టివేసింది.

ఏసీబీ కోర్టు
గతంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో జారీ చేసింది. ఈ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో దీనిపై సిట్ హైకోర్టుకు వెళ్లింది. సిట్ కు హైకోర్టు కూడా ఎదురు దెబ్బ తగిలింది. కాగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

లిక్కర్ కేసు
కాగా లిక్కర్ కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లి జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఈనేపథ్యంలో కస్టడీని పెంచాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. దీంతో నిందితుల జ్యుడీషియల్ రిమాండ్ గడువును జనవరి 7 వరకు పొడిగించారు .

ఈడీ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ఇప్పటికే ఎంటర్ అయిన ఈడీ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పలుమార్లు విచారించింది. తనను ఈడీ వేదిస్తోందని రోహిత్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. నిందితులను విచారించకుండా తనను విచారించడమేంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications