Telangana: ఉద్యోగులకు షాక్.. జీవో నంబర్ 16 రద్దు..!
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జీవో నంబర్ 16ను రద్దు చేసింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తూ జీవో నంబర్ 16ను జారీ చేసింది. దీనిపై కొంత మంది హైకోర్టు ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. అందుకే జీవో నంబర్ 16 రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని పిటిషనర్లు పేర్కొన్నారు.
రెగ్యులరైజేషన్ అయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ అయినట్లు తెలిసింది. వీరంతా హైకోర్టు తీర్పుతో భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులను సంప్రదించగా.. హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ
అస్సలు విషయం ఏమిటో తెలియదని పేర్కొంటున్నారు. తీర్పును బట్టిం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది ఆధారపడి ఉందని వివరించారు.

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్16 ను కొట్టేయడంతో తమ సంతోషం ఆవిరి అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత పలు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ జీవో నంబర్ 16ను తీసుకొచ్చారు.
ఇప్పుడు దీన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. దీనిపై అప్పీల్ కు వెళ్తుందా.. లేక హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. అయితే చాలా మంది ప్రస్తుత ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తనను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications