Telangana: స్పీకర్ దే ఫైనల్ నిర్ణయమా..!
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దానం, కడియం తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గతంలో పలు కోర్టుల తీర్పులను లాయర్ మయూర్ రెడ్డి చదివి వినిపించారు.
బీఆర్ఎస్ తరుఫు న్యాయవాదలు కూడా ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్ పై నిన్నటి విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై అనర్హత కు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులకు సమీక్షించే అధికారం ఉంటుందని ఏజీ వాదించారు. బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు అరికపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు.

చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. కాగా చాలా కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. బడ్జెట్ అంత ఉత్తదే అని చెప్పుకొచ్చారు.
రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్ అంటూ విమర్శించారు. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదని చెప్పారు. అయితే కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ అంతగా మాట్లాడలేదని తెలుస్తోంది. అయితే కవిత అరెస్ట్ పై సరైన సమయంలో స్పందిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications