Telangana Rains: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా వచ్చే మూడు రోజుల్లో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లాలో 18 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డిలో కూడా 11 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.

The Meteorological Department has predicted that heavy rains are likely to occur in many districts of Telangana

కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు తెలంగాణలో ఆది, సోమవారాల్లో ఈ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింగి.

సెప్టెంబర్ 10న వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) అంచనా వేసింది. ఈ నెల 11 వరకు హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+