KCR: ప్రగతి భవన్‍కు పెయింట్ వేయిస్తున్న కేసీఆర్..!
తెలంగాణలో ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే చాలా ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియోలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో తెలంగాణ సీఎం అధికారిక నివాసం అయిన ప్రగతిభవన్ కు కొత్తగా సున్నం కొడుతున్నట్లు ఉంది.
ప్రగతిభవన్ కు కొత్తగా పెయింట్ వేయించండం ఎందుకని సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అయితే ఈ ఫొటోలు కొత్తదా.. పాతదా తెలియరాలేదు. గతంలో ప్రగతి భవన్ కు పెయింట్ వేస్తున్న ఫొటో అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రగతిభవన్ కు రంగులు వేయిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాకేసీఆర్ ప్రగతిభవన్ కు పెయింట్ ఎందుకు వేయిస్తున్నారని చర్చ కొనసాగుతోంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ఖాలీ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ పేరును అంబేడ్కర్ భవన్ గా మారుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆదివారం ఫలితాలతో ఎవరు ప్రగతి భవన్ ఉంటారు.. ఎవరు ఖాలీ చేస్తారో తేలిపోనుంది. ఈ ఫొటో ఎప్పటిది అయినా.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు వర్తింపజేయడంతో వైరల్ అవుతోంది. మరోవైపు డిసెంబర్ 4న కేబినేట్ భేటీ ఉందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications