Tomato: సెంచరీకి చేరువలో కూరగాయల ధరలు.. టమాటా రూ.100 లకు పైనే..!
కూరగాయల రేట్లు మండి పోతున్నాయి. ఏం కొందమన్నా రూ. 80 పైనే ఉన్నాయి. దీంతో సామాన్యులు భయపడిపోతున్నారు. ఎక్కువగా వాడే టమాటా ధర ఏకంగా రూ. 100 నుంచి రూ.120 పలుకుతోంది. టమాటా సాగు రాష్ట్రంలో తగ్గిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సరకు తక్కువ రావడంతో ధరలు పెరుగుతోన్నాయి. మూడు రోజుల క్రితం కిలో టమాటా రూ.60 నుంచి రూ.70 గా ఉంది. తాజాగా ధర డబుల్ అయింది. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
టమాటాతో పాటు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది. మొన్నటి వరకు రూ.100 లకు నాలుగు కిలోలు వచ్చే ఉల్లిగడ్డలు ప్రస్తుతం రూ.100 రెండి కిలోలే వస్తున్నాయి. అంటే కిలో ఉల్లి రూ.50 పలుకుతోంది. కొతిమీరు ధర కూడా భారీనే పెరిగింది. కిలో కొతిమీరు రూ.200 పైనే పలుకుతోంది. ప్రెంచ్ బీన్స్ రూ. 175 -210, టమాటా రూ. 100-120, పచ్చిమిర్చి రూ.100-120, దొండకాయ రూ. 70-80, బీరకాయ రూ.80-100, బెండకాయ రూ.80-100, కాకరకాయ రూ.80, క్యారెట్ రూ.80, చామదుంప రూ.60 గా ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి పలురకాల కూరగాయలు దిగుమతి చేసుకుంటాం. ఇక్కడ పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని బోయిన్ పల్లి మార్కెట్ కు వచ్చే కూరగాయల్లో 84 శాతం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు రాక తగ్గుముఖం పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
బుధవారం బోయిన్ పల్లి మార్కెట్ కు 23,840 క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ధరలు నెల రోజులు పాటు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. జులైలో కూరగాయ ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మన రాష్ట్రం కూరగాయలు అందుబాటులోకి రావాలంటే ఆగస్టు ఫస్ట్ వరకు ఆగాల్సిందేనని మార్కెటింగ్, హార్టికల్చర్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications