Munugodu By Election: మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఊపందుకోనున్న ప్రచారం..
మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి 100కు పైగా నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిసింది. 7న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు శుక్రవారం వరకు కొనసాగాయి. రేపు,ఎల్లుండి నామినేషన్ల స్కృూటిని ఉంటుంది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించగా.. 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు. చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ ర్యాలీ
బంగారిగడ్డ కూడలి నుంచి చండూరు వరకు ర్యాలీ చేపట్టి చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో నామ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి భారీగా తరలొచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు పాల్గొన్నారు. మునుగోడులో ప్రచారం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జబితా విడుదల చేసింది. ఈ లిస్టులో మాణిక్కం ఠాగూర్, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంత రావు, చల్లా వంశీ చంద్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మధుయాష్కిగౌడ్, దామోదర రాజనర్సింహ ఉన్నారు.

ఊపందుకోనున్న ప్రచారం
గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. సోమవారం నాడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరు ప్రచారంపై దృష్టి పెట్టారు. అయితే ఈ ఉప ఎన్నికలో భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications