చరిత్రలో నిలిచేలా రేవంత్ నిర్ణయం - కేసీఆర్ వాట్ నెక్స్ట్..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ నేడు (సోమవారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. దివంగత ప్రధాని మన్మోహన్ కు అసెంబ్లీ నివాళి అర్పించనుంది. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ ఏర్పాటైంది. దీంతో..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ మన్మోహన్ స్మృతి ఏర్పాటు కు నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రత్యేక సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరు పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సభ నివాళులర్పించనున్నది. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వివిధ హోదాల్లో మన్మోహన్ దేశానికి చేసిన సేవలను సీఎం కొనియాడనున్నారు. ఆర్దిక మంత్రిగా, ప్రధానిగా దేశ ఆర్దిక వ్యవస్థ.. కీలక విధానాల్లో తీసుకున్న నిర్ణయాలను సభలో ప్రస్తావించనున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాని గా మన్మోహన్ పాత్రను రేవంత్ గుర్తు చేయనున్నారు.

ఈ సమావేశాల్లో మన్మోహన్ స్మృతి ఏర్పాటు పైన రేవంత్ ప్రకటన చేయనున్నారు. హైదరాబాద్ లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు దిశగా ప్రకటన ఉండే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకానికి మన్మోహన్ పేరు పెట్టాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు. ఈ రోజు సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
ఈ సమావేశానికి అన్ని పార్టీల సభ్యులు హాజరు కానున్నారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ హాజరు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే సాకారం కావటంతో.. ఈ ప్రత్యేక భేటీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మన్మోహర్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి నివాళి అర్పించారు. దీంతో, కేసీఆర్ హాజరు పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications