వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్స్ మూసివేస్తాం - డ్రగ్స్ దొరికితే నగర బహిష్కరణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక..!!

|
Google Oneindia TeluguNews

పబ్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. తమ విధానం స్పష్టం చేసింది. డ్రగ్స్ దందా చేయాలనుకుంటే దేశం విడిచి వెళ్లండంటూ మంత్రి శ్రీనివాస గౌడ్ పబ్ నిర్వాహకులను హెచ్చరించారు. నగరంలోని పబ్ నిర్వాహకులతో ఎక్సైజ్‌శాఖ మంత్రి సమావేశమయ్యారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించమని స్పష్టం చేసారు. పబ్ ల్లో డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్టు అమలు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. చట్టం ఉపయోగించి అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.

పబ్ లే లేకుండా చేస్తామని వార్నింగ్

పబ్ లే లేకుండా చేస్తామని వార్నింగ్


ఇదే విధంగా ఇంకెవరైనా వ్యవహరిస్తే అసలు నగరంలో పబ్ లే లేకుండా చేసే పరిస్థితి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి డబ్బు ముఖ్యం కాదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పేకాట క్లబ్బులను మూయించామని.. గుడుంబాను అరికట్టామని వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేసారు. డ్రగ్స్ ఫిర్యాదుల పైన సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. సొంత పార్టీ నేతలు ఉన్నా..వదిలి పెట్టవద్దని ఆదేశించారని వెల్లడించారు.

అవసరమైతే నగర బహిష్కరణ

అవసరమైతే నగర బహిష్కరణ


పబ్ నిర్వాహకులకు ఇప్పటికే హెచ్చరికలు చేసినా..మరలా డ్రగ్స్ దొరికాయని..ఇక నుంచి ఈ విధానం మానుకోవాలని సూచించారు. కొంతమంది అనుమానితుల లిస్టు ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. వారి మీద నిఘా కొనసాగుతుందన్నారు. డ్రగ్స్ దందా చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులకు లోబడి నిర్వహించుకోవాలని సూచించారు. 24 గంటల అనుమతి ఉన్న పబ్ లు సర్వీసు మాత్రమే చేయాలని స్పష్టం చేసారు. ఆన్‌లైన్‌ డెలివరీ చేసేవారిపై కూడా నిఘా పెట్టామని చెప్పారు.

సంబంధిత అధికారులే బాధ్యులు

సంబంధిత అధికారులే బాధ్యులు


ప్రభుత్వ నిబంధనలు పాటించిని పబ్ ల పైన చర్యల విషయంలో సంబంధిత ప్రాంత అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధిత ఏరియా అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. సౌండ్స్ విషయంలోనూ పరిమితి పాటించాలని సూచించారు. గత శనివారం ఒక పబ్ లో అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకున్నామని..ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేసారు. ఎక్కడైనా ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీనివాస గౌడ్ హెచ్చరించారు.

English summary
Telagana Govt serious warning to Hyderabad pub owners on drugs issue, minister Srinivasa Goud warned pubs will be closed in any violation occured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X