Telangana: యూనివర్శిటీల ఇంఛార్జీ వీసీల పదవీకాలం పొడగింపు..
తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలను నియమించింది. పూర్తిస్థాయి ఇంఛార్జీలు నియమించే వరకు వీరిని కొనసాగించాలని అప్పుడు నిర్ణయించింది. జూన్ 15 లోపు పూర్తి స్థాయి వీసీలను నియమించాలని.. ఇంఛార్జీ వీసీలను జూన్ 15 వరకు నియమించింది. ప్రస్తుతం ఇంఛార్జీ వీసీల పదవీ కాలన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇంఛార్జీ వీసీలు కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 21న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 10 వర్సిటీలకు ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జి వీసీలుగా నియమించిన సంగతి తెలసిందే. వీరి పదవీకాలం జూన్ 15 వరకు ఉంది. అయితే పూర్తి స్థాయి వీసీల నియామకం ఇంకా జరగకపోవడంతో ఇన్‌ఛార్జి వీసీల పదవీ కాలన్ని పొడగించింది. పూర్తి స్థాయి వీసీల నియమించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వీసీల ఎంపికకు కమిటీ నిమియమించాలి.

వారు వీసీలను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపాలి. దానికి సర్కార్ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత ఎంపికైన పేర్లను గవర్నర్ కు పంపాలి. దానికి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత పూర్తిస్థాయి వీసీల నియామకం జరుగుతుంది. దీనికి సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్, జేఎన్‌టీయూ బాధ్యతలను బుర్ర వెంకటేశ్‌ను నియమితులయ్యారు.
కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీకి ఇంఛార్జీ వీసిగా శైలజ రామయ్యర్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌కి జయేశ్ రంజన్, పాలమూరు వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా నదీం అహ్మద్‌ను నియమించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications