హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం : రాష్ట్రపతి ఆమోదముద్ర ..!!

తెలంగాణ హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయటంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి.

ఏడుగురులో నలుగురు మహిళలకే ప్రాధాన్యత

ఏడుగురులో నలుగురు మహిళలకే ప్రాధాన్యత

జ్యుడీషియల్‌ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్‌ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్‌ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవిదేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 10 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు

తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టులో ఇంకా 24 న్యాయమూర్తుల పదవులు ఖాళీలు ఉంటాయి. కాగా.. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులతోపాటు ఒడిశాకు ముగ్గురు, కేరళ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకాన్ని కూడా రాష్ట్రపతి ఆమోదించారు. కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ ..1967, జూన్‌ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో-ఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఉన్నారు.

కేంద్రం నోటిఫికేషన్ జారీ

కేంద్రం నోటిఫికేషన్ జారీ

డాక్టర్‌ సి.సుమలత 1972 ఫిబ్రవరి 5న జన్మించారు. 2005లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులైన ఆమె.. వెంటనే జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 2007లో మదనపల్లిలో జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు, గుంటూరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ జి.రాధారాణి: 1963, జూన్‌ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్‌ జడ్జిగా ఉన్నారు.

17కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

17కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

ఎం.లక్ష్మణ్‌: ఈయన 1965 డిసెంబర్‌ 24న జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని రంగారెడ్డి, సిటీ సివిల్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) పరీక్షలో ఎంపికై.. 2008లో మహబూబ్‌నగర్‌ ఏడీజేగా నియమితులయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో సేవలందించారు. ప్రస్తుతం నాంపల్లి లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిగా కొనసాగుతున్నారు.

Recommended Video

    సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జానానికి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్| Oneindia Telugu
    పెరిగిన పోస్టుల సంఖ్యతో

    పెరిగిన పోస్టుల సంఖ్యతో

    ఎన్‌.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యా రు. ప్రస్తుతం హైదరాబాద్‌ క్రిమినల్‌ కోర్టుల మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్నారు. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: 1961, ఏప్రిల్‌ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ ఆవరణలోని స్మాల్‌ కాజెస్‌ చీఫ్‌ జడ్జిగా పనిచేస్తున్నారు. పి.మాధవీదేవి: ఈమె 1965 డిసెంబర్‌ 28న జన్మించారు. బీకాం, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసి.. 1992 నుంచి 2005 వరకూ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2005 మార్చిలో సర్వీసె్‌సలో చేరిన ఆమె.. ప్రస్తుతం ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ జ్యుడీషియల్‌ మెంబర్‌గా కొనసాగుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+