తీన్మార్ మల్లన్న అరెస్ట్: క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసుల సోదాలు, కంప్యూటర్ల సీజ్

తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. క్యూ న్యూస్ ఆఫీసులో గంట సేపు సోదాలు చేశారు.

హైదరాబాద్: తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. క్యూ న్యూస్ ఆఫీసులో గంట సేపు సోదాలు చేశారు. క్యూ న్యూస్ ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను పోలీసులు పరిశీలించారు. ఇంతకుముందే కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీసులో దాదాపు 20 మంది పోలీసులు సోదాలు చేశారు. ఆఫీసులోని ఉద్యోగులను, ఇతర సిబ్బందిని బయటకు పంపారు. ఒక్కసారిగా ఇంతమంది పోలీసులు రావడంతో క్యూ న్యూస్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

 theenmar mallanna arrested: police raids in q news office

కాగా, ఉద్యోగులు బయటకు వెళ్లిన తర్వాత క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించారు. క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించడంతోపాటు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడంతో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, తీన్మార్ మల్లన్న(theenmar mallanna)ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం చేస్తారోనని ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, గత కొంత కాలంగా తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను ప్రసారం చేశారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు దుండగులు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటనపై తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+