Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్పుడు తెలంగాణ కోసం.!ఇప్పుడు రాష్ట్ర రక్షణ కోసం మిలియన్ మార్చ్.!కోదండరాం వినూత్న ప్రయత్నం!

ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రొ.కోదండరాం రచించిన వ్యూహాలు ఊహించని ఫలితాలు ఇచ్చాయని, తెలంగాణ ఏర్పడడంలో కోదండరాం పాత్ర ఎంతొ కీలకమని జనసమితి విద్యార్ధి విభాగం నేతలు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మరచిపోయిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన 1200 అమర వీరుల కుటుంబాలకు అదుకోకుండా 500 మందిని గుర్తించి మిగతా వారి కుటుంబాలకు తీరని ద్రోహం చేశాడని, మిగిలిన ఆమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని జన సమితి పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మార్చి పదవ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే "తెలంగాణ బచావో" సదస్సు పోస్టర్ ను గన్ పార్క్ లో జన సమితి పార్టీ విద్యార్థి విభాగం నేతలతో కలిసి వినోద్ ఆవిష్కరించారు.

తెలంగాణ సాధనలో మిలియన్ మార్చ్ కీలక పాత్ర.. జనసమితి నేతల వినూత్న కార్యక్రమాలు

తెలంగాణ సాధనలో మిలియన్ మార్చ్ కీలక పాత్ర.. జనసమితి నేతల వినూత్న కార్యక్రమాలు

సీఎం చంద్రశేఖర్ రావు ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని విద్యార్థుల వీరోచిత పోరాటం, ఆత్మ బలిదానలు, ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ సకల జనుల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యిందనన్నారు వినోద్. నాటి ఉద్యమ ఆకాంక్షలను మరచిన సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మీద పోరాటానికి తెలంగాణ ఉద్యమకారులు పార్టీ జెండాలను పక్కన పెట్టి ఏకం అయ్యి తెలంగాణను సీఎం చంద్రశేఖర్ రావు కబంద హాస్తాల నుండి కాపాడుకోవాలని వినోద్ పిలుపునిచ్చారు.

అమరుల త్యాగాల ఫలమే తెలంగాణ.. సీఎం అమరులకు ద్రోహం చేసారన్న జనసమితి నేతలు

అమరుల త్యాగాల ఫలమే తెలంగాణ.. సీఎం అమరులకు ద్రోహం చేసారన్న జనసమితి నేతలు

తెలంగాణ, ఉద్యమకారులందరు టీజేఎస్ నిర్వహించే సదస్సుకు రావాలని పిలుపునిచ్చారు వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో జన సమితి పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరేందర్ నకిరేకంటి, జన సమితి పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు మన్నల నేత్ర,నాయకులు అమిత్, వ్యాస్,మనోజ్, అంజి,హరీష్ గుణిషా, ప్రదీప్, ఉదయ్, మోహన్, సాయిరాం, కృష్ణ, నరేష్, సంజయ్,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బచావో తో నూతన కార్యక్రమం.. ఉద్యమకారులు తరలి రావాలన్న టీజేఎస్

తెలంగాణ బచావో తో నూతన కార్యక్రమం.. ఉద్యమకారులు తరలి రావాలన్న టీజేఎస్

అంతే కాకుండా ముషీరాబాద్ లో "తెలంగాణ బచావో" సదస్సు పోస్టర్ ను జన సమితి పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆవిష్కరించారు. మిలియన్ మార్చ్ కు స్ఫూర్తిగా ఈనెల 10న తెలంగాణ జన సమితి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ బచావో సదస్సుకు ముషీరాబాద్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ముషీరాబాద్ ఇన్చార్జ్ ఎం నరసయ్య విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో బచావో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు.

మిలియన్ మార్చ్ రూపకర్త ప్రో. కోదండరాం.. మార్చ్ నేపథ్యంలో ఈనెల 10న వినూత్న కార్యక్రమాలు

మిలియన్ మార్చ్ రూపకర్త ప్రో. కోదండరాం.. మార్చ్ నేపథ్యంలో ఈనెల 10న వినూత్న కార్యక్రమాలు

ఇందులో భాగంగా తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులపై ఉందని అభిప్రాయపడ్డారు జన సమితి విద్యార్థి నేతలు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ లో కీలకంగా పాల్గొన్న ముషీరాబాద్ ఉద్యమకారులందరూ ఈ సదస్కు రావాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నగర ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, బీసీ జన సమితి నగర అధ్యక్షుడు ఎస్ జస్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+