Raksha Bandhan 2023: భద్రకాలం ఏమిటి..ఆ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది..?
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగపై సందిగ్దత నెలకొంది. రాఖీ పండుగ బుధవారం జరుపుకోవాలా లేక గురువారం జరుపుకోవాలా అనే దానిపై చర్చలు జరుగుతోన్నాయి. సాధారణంగా రాఖీ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం రావడంతో రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని కన్ఫ్యూజన్ గా మారింది. అయితే పౌర్ణమి ఘడియాల్లోనే సోదరులకు రాఖీ కట్టాలని పురోహితులు చెబుతున్నారు. అయితే పౌర్ణమి బధువారం ఉందా లేక గురువారం ఉందా అనేది దానిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు.
అందుకే రాఖీ పౌర్ణమి ఆగస్టు 30న జరుపుకోవాలా లేక 31న జరుపుకోవాలనేది పెద్ద సందేహంగా మారింది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చినట్లు పురోహితులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 30, 31 రెండు రోజుల్లో రాఖీ పండుగు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. హిందూ క్యాలుండర్ ప్రకారం రాఖీ 30,31 రెండు తేదీలలో జరుపుకోవచ్చట. 30న పౌర్ణమి గడియలు ఉన్నప్పటికి రాత్రి 9.01 వరకు భద్రకాలం ఉందని పురోహితులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని చెబుతున్నారు.

అలా కడితే దోషమని హెచ్చరిస్తు్ననారు భధ్ర కాల ప్రభావం వారి(సోదరులపై)పై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదని పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే 30నద రాత్రి 9.02 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు సోదరులకు రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. అక్కచెల్లెళ్లుఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుందట.
పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 31న రాఖీ కట్టేందుకు ముహూర్త సమయయాలు కూడా ఉన్నాయి. ఉదయం 5.58 నుంచి ఉదయం 7.34 గంటలలోపు రాఖీ కొట్టొచ్చని చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం 12.21 గంటల నుంచి 3.32 గంటల లోపు, సాయంత్రం 5.08 గంటల నుంచి 8.08 గంటలలోపు రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. రాఖీ పండుగ నిర్వహించుకోడవం హిందూ సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది.












Click it and Unblock the Notifications