KTR: కేటీఆర్ బామ్మర్ది ఇంటి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హల్ చల్..!
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజయదుర్గంలోని ఒరియన్ విల్లాస్ లో సోదాలు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు వచ్చారు. అయితే వారంట్ లేకుండా ఎలా వచ్చారని.. లాయర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు వారంట్ తో వెళ్లారు. అయినప్పటికీ పోలీసులను ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరువు పొగోట్టుకుంటున్నారని కాంగ్రెస్ చెబుతున్నారు. కేటీఆర్ బామ్మర్ది కోసం ఇంతగా దిగజారుతారా అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో ఆదివారం రేవ్ పార్టీ జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రేవ్ పార్టీపై దాడులు చేశారు. పార్టీలో 38 మంది ఉండగా.. అందులో 16 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు. వారంతా మద్యం, డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు అనుమానించారు.

దీంతో వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయిత మహిళలను అక్కడ నుంచి బయటకు పంపారు. పురుషులకు మాత్రం డ్రగ్స్ టెస్ట్ చేశారు. అయితే ఈ టెస్ట్ శాంపిల్స్ ఇవ్వడానికి వారు నిరాకరించారు. మూడు గంటల తర్వాత విజయ్ మద్దూరి శాంపిల్స్ ఇచ్చారు. టెస్ట్ లో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే అనుమతి లేకుండా పార్టీ చేసినందకు కార్తీక, రాజ్ పాకాలా పై కేసు నమోదు చేశారు. అయితే విజయ్ మద్దూరి విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి.
రాజ్ పాకాలే తనకు డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. అందుకే రాజ్ పాకాలా ఇంట్లో సోదాలు చేస్తున్నామని వివరించారు. మరోపక్క ఈ కేసులు మహిళలను ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రముఖులను తప్పించాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫామ్ హౌస్ కు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను బయట పెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండే చేస్తున్నారు. అయితే దీనిపై కేటీఆర్ ఇంతవరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications