కెసిఆర్ ప్రభుత్వంపై రిటైర్డ్ జడ్జి ఫైర్: ఇంత జరుగుతున్న ఫాంహౌస్‌లోనే!

హైదరాబాద్: పారిశ్రామికవేత్తల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం రైతుల పట్ల మాత్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర రైతు సంఘాల జెఏసి చైర్మన్ చంద్రకుమార్ ఆదివారం అన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అక్కడి ప్రభుత్వాలు రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తూ వాటికి అయ్యే ఖర్చును భరిస్తున్నాయన్నారు. మనం కూడా అలా చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంలో కాకుండా అదిలాబాద్ జిల్లా తుమ్మిడిహేట్టిలోనే నిర్మించాలన్నారు. రైతులకు మేలు జరిగేలా ఆలోచించాలని కోరారు.

'There is a TRS plot to target leaders belonging to one community'

కెసిఆర్‌ది విచిత్ర పాలన: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది విచిత్రమైన పాలన అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదివారం ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణకు తొలి సిఎంగా దళితుడిని చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే ఆయనే ఆ సీట్లో కూర్చున్నారన్నారు. పేద దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు కేవలం పన్నెండు వందల మందికి మాత్రమే ఇచ్చారని, దానిని విస్మరించారన్నారు.

గోబెల్స్ వారసుల్లా టిఆర్ఎస్ నేతలు

టిఆర్ఎస్ నేతలు జూపల్లి కృష్ణా రావు, శ్రీనివాస్ గౌడ్‌లు గోపెల్స్ వారసుల్లా తయారై ఒక సత్యాన్ని పలుమార్లు చెప్పడం ద్వారా నిజం చేయవచ్చుననే భ్రమలో ఉన్నారని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి, రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తదితరులు అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి జూపల్లి చేయని ప్రయత్నం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు సింగాయపల్లిలో పోలీసులతో కర్ఫ్యూ పెట్టించి ఉద్యమకారులను కొట్టించిన ఘటనను పాలమూరు జిల్లావాసులు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు.

తెలంగాణలో కరువు కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని ఉద్యమ సమయంలో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు దానిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+