తెలంగాణా పంచాయతీ ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ ఇవే!

గ్రామ పంచాయితీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3 వేల 834 గ్రామ పంచాయతీలు, 27 వేల 628 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లు మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. సర్పంచ్ పదవికి 12 వేల 960 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 65 వేల 455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

93 వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది
93 వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. కాగా మొదటి దశ పోలింగుకు నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయితీల్లో 396 పంచాయితీలకు ఎన్నిక ఏకగ్రీవం అయింది. 9 వేల 633 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 గ్రామ పంచాయతీలు, 169 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక పంచాయతీ ఎన్నికల్లో హరిత పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

These are the special attractions in the Telangana Panchayat elections

పర్యావరణహితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు
వరంగల్ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరిగిన మొదటి విడత పోలింగ్‌లో పర్యావరణహితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

హరిత పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల ఉత్సాహం
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి మండలంలో రెండు చొప్పున హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద, కొత్తపల్లి, రాయపర్తి మండలం దుబ్బతండ, రాగన్నగూడెం, పర్వతగిరి మండలం ఏబీ తండా, పర్వతగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు.

లంచ్ సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకులు
ఈ కేంద్రాల్లో పచ్చని మొక్కలు, పూల అలంకరణ, ప్లాస్టిక్‌రహిత సామగ్రి, పర్యావరణహిత అలంకరణతో ఓటర్లకు మైమరపించే అనుభూతిని కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ సౌకర్యం, చిన్న పిల్లల తల్లుల కోసం ప్రత్యేక కుర్చీలు అందుబాటులో ఉంచారు. లంచ్ సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకులు, ఎండు విస్తరాకులు ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఫోటోలు తీసుకుంటూ తమ ఓటు హక్కు వినియోగించిన ఓటర్లు
పర్వతగిరి మండలంలోని ఏబీ తండా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్ ఓటర్లను ఆకట్టుకుంది. అనేక మంది అక్కడ ఫోటోలు తీసుకుంటూ తమ ఓటు హక్కు వినియోగించిన ఆనందాన్ని పంచుకున్నారు. గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఇతర పోలింగ్ స్టేషన్లను కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె అధికారులకు సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాలు
ఇలా వరంగల్ జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పర్యావరణహిత పోలిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని, ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అవసరాన్ని ఈ చర్య ద్వారా ఓటర్లకు తెలియజెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+