Tg Sarpanch Elections : సాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు !!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం చివరి అంఖానికి చేరుకుంది. ఈరోజు ( డిసెంబర్ 17, 2025 ) ఉదయం 7 గంటల నుంచే మూడో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కాగా మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా.. అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమవ్వగా.. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది.

దీంతో మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది పోటీ చేస్తున్నారు. అలానే 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా 116కి నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమవ్వగా.. 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28,410 వార్డులకు గాను 75,725 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా ఈ చివరి దశ ఎన్నికల్లో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు.. 140 మంది ఇతరులతో కలిపి మొత్తం 53,06,395 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

third-phase-of-panchayat-elections-polling-started-in-telangana

ఇక కాగా పోలింగ్‌ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు భేటీ అయ్యి ఉపసర్పంచ్‌ని ఎన్నుకుంటారు.
ఇందుకోసం 36,452 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వివరించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ 9240021456 టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని.. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+