వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదే.. వర్కవుట్ అవుతుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ దృఢసంకల్పంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో మూడోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలని భావిస్తున్న కెసిఆర్ మిగతా పార్టీల కంటే ముందే ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం అయిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు చాలా నియోజకవర్గాలలో ప్రకటించిన కేసీఆర్, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులను ప్రకటించడంతో పాటుగా అసంతృప్త నేతలను కూడా కేసీఆర్ బుజ్జగించారు. పలు జిల్లాలలో సిట్టింగులకు సీట్లు కేటాయించిన కెసిఆర్ టిక్కెట్లను ప్రకటించిన తర్వాత కూడా ప్రజలలో సంబంధిత అభ్యర్థిపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందని తెలిసి దిద్దుబాటుకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చడానికి వీలులేని కారణంగా ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేని చోట, వారిని ప్రజలు ఆదరించరని భావించే చోట, అక్కడ ప్రజల వ్యతిరేకతకు గల కారణాలను తెలుసుకుంటున్న కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఇప్పటికే వీక్ గా నియోజకవర్గాల లిస్టు సీఎం కేసీఆర్ చేతిలో ఉన్నట్టు సమాచారం.
ఏ సమస్యలపైన అయితే ప్రజలు అసహనంతో ఉన్నారో, ఆ సమస్యల పరిష్కారాన్ని సూచిస్తూ, ప్రజల మద్దతును కూడగట్టే కెసిఆర్ నేరుగా ఆయా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేసే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం కోసం, స్థానికంగా తమ పార్టీ నేతలపై ఉన్న అసంతృప్తిని తొలగించడానికి కానీ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు.
ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి చేయాల్సిన వ్యూహాలను మంత్రి కేటీఆర్, హరీష్ రావులకు దిశా నిర్దేశం చేసిన కేసీఆర్, అవసరమైన చోట తానే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలపైన వ్యతిరేఖత ఉన్నప్పటికీ తన చరిష్మా వర్కవుట్ అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాలలో నియోజకవర్గ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నచోట ఆయన ఫోకస్ చేయనున్నారు. హ్యాట్రిక్ మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారు.












Click it and Unblock the Notifications