వందే భారత్ కన్నా ఈ రైలు వెయ్యి రెట్లు బెటర్
ప్రధాన నగరాలను అత్యంత తక్కువ సమయంలో చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్ల పేరుతో పట్టాలెక్కిన వందేభారత్ రైళ్లు ప్రయాణికుల నుంచి పూర్తిస్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోతున్నాయి. అందుకు కారణం ఛార్జీలు. చాలా దారుణంగా ఉంటున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చాలా మార్గాల్లో సగం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి లాంటి మార్గాల్లోనే ఆదరణ లభిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే చాలావరకు ఖాళీగానే తిరుగుతున్నాయి.
10.10కల్లా సికింద్రాబాద్ కు
విజయవాడ నుంచికానీ, గుంటూరు నుంచి కానీ వందేభారత్ రైలుకు ఛార్జీ రూ.వెయ్యి రూపాయల వరకు ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ అయితే రూ.1800 వరకు ఉంది. అదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా లింగంపల్లి వరకు ఎంప్లాయిస్ రైలు నడుస్తోంది. ఈ రైలులో విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు 135 రూపాయలు, గుంటూరు నుంచి 120 రూపాయలు ఛార్జీగా ఉంది. ఏసీలో అయితే 570 రూపాయలు అవుతోంది. మంగళగిరి, గుంటూరు, నల్గొండలోనే దీనికి స్టాప్స్ ఉన్నాయి. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరితే 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

వందేభారత్ కన్నా 2 నిముషాలు ముందే
గుంటూరు నుంచి ఈ రైలు సికింద్రాబాద్ చేరుకునేందుకు పట్టే సమయం 3 గంటల 53 నిముషాలు. అదే వందేభారత్ లో అయితే 3 గంటల 55 నిముషాలు పడుతుంది. ఛార్జీలు ఎక్కువతోపాటు రెండు నిముషాల సమయం కూడా ఎక్కువే. రాత్రి 7.45 గంటలకు గుంటూరులో బయలుదేరితే రాత్రి 11.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీంతో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, గన్నవరం తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించేవారంతా ఎంప్లాయిస్ రైలునే ఎంచుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో కూడా ఈ రైలునే ఎంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications