సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడిని బెదిరించి, దాడి చేసి బైక్‌పై ప్రేయసిని ఎత్తుకెళ్లి పడిపోయారు

By Pratap
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: ప్రేమికుడిని బెదిరించి దాడిచేసి ప్రియురాలిని బైక్ మీద ఎత్తుకుని పోతుండగాస్థానికులు వెంబడించి దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో సోమవారం చోటుచేసుకుంది. సిద్దిపేట కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని(17) తన ప్రియునితో కలిసి నాగదేవత గుడి రూట్‌లో వెళ్లారు.

వారిని గమనించిన నలుగురు దుండగులు ప్రియుడిని బెదిరించి దాడిచేసి ఫోన్ తీసుకొని విద్యార్థినిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్లారు. ఈ క్రమంలో ప్రియుడు రోడ్డు మీదికి వచ్చి జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వెంటనే వారిని వెంబడించగా దుండగులు వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.

దీంతో ఒక నిందితుడు స్థానికులకు పట్టుబడగా అతనిని పోలీసులకు అప్పగించి విద్యార్థినిని రక్షించారు. పరారైన మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Threatening a youth tried to abduct his lover

సిద్ధిపేటలో దొంగల స్వైర వివాహారం

మెదక్ జిల్లా సిద్ధిపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. 8 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 10 వేల నగదు దోచుకెళ్లారు. సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెంది న మహ్మద్ ఆరీఫా కరీంనగర్ జిల్లా కోహెడ తహసీల్దార్. ఆదివారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు.

దాంతో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. పక్కనే ఉన్న శ్రవణ్‌రెడ్డి ఇంటి తాళం పగులగొట్టి 35 తులాల వెండి, రూ. 10 వేల నగదు అపహరించుకెళ్లారు. వన్‌టౌన్ పోలీసులు క్లూస్‌టీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అతివేగంగా బైక్ నడుపుతూ అదుపు తప్పి రోడ్డు పక్కన బోర్డుకు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పరిధిలో జరిగింది. రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ ఆ ప్రమాదం గురించి వివరించారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తాండూర్‌కు చెందిన ఉమేష్(21), సంతోష్, ప్రవీణ్‌లు కలిసి బైక్‌పై జహీరాబాద్‌కు వచ్చారు. పట్టణంలోని బంధువుల వద్ద విందు చేసి తిరిగి వెళ్తున్నారు.

జహీరాబాద్ మండలంలోని హోతి(కే) శివారులోకి వెళ్లగానే వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బోర్డును ఢీకొనడంతో ఉమేష్ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో చికిత్స కోసం జహీరాబాద్ ప్రభు త్వ దవాఖానకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English summary
Miscreants tried to abduct a girl threatening her lover at Siddipet in Medak district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X