ప్రియుడి మోజులో పడి ముగ్గురు కన్నబిడ్డలను కడతేర్చింది! చివరకు
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు అనేక కాపురాలను కూల్చుతున్నాయి. భాగస్వాముల హత్యలకు కూడా తెగిస్తుండటంతో కన్నబిడ్డలు అనాథలవుతున్నారు. కొందరైతే కన్న బిడ్డలనే కనికరం లేకుండా వారిని కూడా హత మారుస్తున్నారు. ప్రియుడి మోజులో పడి ఇటీవల ముగ్గురు పిల్లలను చంపిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడిని కూడా కటకటాల వెనక్కి నెట్టారు.
హైదరాబాద్ అమీన్‌పూర్‌లో రజిత అనే మహిళ ప్రియుడి మోజులో పడి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది. ఆ నేరాన్ని భర్తపై వేయాలని చూసింది. అయితే, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు రజితతోపాటు ఆమె ప్రియుడు శివను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ నిందితులను రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు కన్న బిడ్డలను చంపడం స్థానికంగా కలకలం రేపింది.

ఇటీవల జరిగిన గెట్ టు గెదర్ పార్టీలో శివ అనే వ్యక్తిని కలిసింది. పదో తరగతి వరకు శివతో కలిసి రజిత చదువుకుంది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొన్ని నెలలుగా శివతో రజిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శివతో కలిసి బతకాలని నిర్ణయించుకున్న రజిత.. దారుణానికి పాల్పడేందుకు సిద్ధమైంది.
రజితకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉండటంతో తనతో ఉండేందుకు ప్రియుడు శివ ఆమెను నిరాకరించాడు. పిల్లల్ని చంపి వస్తే తనతో జీవించేందుకు అవకాశం ఇస్తానని శివ చెప్పడంతో అందుకు రజిత అంగీకరించింది. పిల్లలకు పెరుగులో విషం కలిపి చంపేయాలని రజితకు శివ చెప్పాడు. పిల్లలు చనిపోతే భర్త చెన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆమెకు ఐడీయా ఇచ్చాడు.
శివ చెప్పినట్లుగానే ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8)లను చంపిన రజిత.. తనకు కడుపు నొప్పి అంటూ నాటకం ఆడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు భర్త చెన్నయ్య. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. ఆ తర్వాత దర్యాప్తులు రజిత చేసిన దారుణం వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసి రజితతోపాటు ఆమె ప్రియుడు శివను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications