మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా చామన్‌పల్లి గ్రామస్తులు. మక్తల్ వైపు నుండి వస్తోన్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications