విషాదం : పండగ గ్రాండ్‌గా జరుపుకోవాలనుకున్న కుటుంబం... స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు...
ఉగాది(ఏప్రిల్ 13) పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో పండగ జరుపుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం ఉత్సాహంగా ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కానీ మార్గమధ్యలో అనుకోని ప్రమాదం వారి జీవితాలను బలిగొన్నది. లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.

కారులో బయలుదేరిన కుటుంబం...
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్ రెడ్డి(45) భార్య సుజాత(40),కుమార్తె నేహారెడ్డి(12),కుమారుడు సూర్యతేజలతో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం(ఏప్రిల్ 13) ఉగాది పండగ కావడంతో స్వగ్రామానికి వెళ్లి పండగ జరుపుకోవాలన్నారు. పండగకు అన్నదమ్ముల కుటుంబాలు కూడా స్వగ్రామానికి వస్తుండటంతో అంతా కలిసి ఘనంగా పండగ చేసుకోవాలనుకున్నారు.

లారీని ఓవర్ టేక్ చేయబోయి...
ఇదే క్రమంలో ఆదివారం(ఏప్రిల్ 11) ఉదయం మురళీ మోహన్ రెడ్డి ఫ్యామిలీ కారులో కడప జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరింది. అలా కారు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్దకు చేరుకోగా... లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై అటుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు,బొలెరో వాహనం నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మురళీ మోహన్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా... అతను మార్గమధ్యలోనే మృతి చెందాడు.

ముగ్గురు మృతి
మురళీ మోహన్ రెడ్డి భార్య సుజాత,కుమార్తె నేహా రెడ్డిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు సాయితేజా రెడ్డితో పాటు బొలెరోలో ప్రయాణిస్తున్న సునీల్,రాజు,సత్యం అనే ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు,సోదరిని కోల్పోవడంతో సూర్య తేజా రెడ్డి అనాథగా మిగిలిపోవడం విషాదం.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications