మద్యం మత్తు: క్లబ్‌లో టెక్కీల వీరంగం
హైదరాబాద్: నగరంలోని ఓ క్లబ్‌లో తమకు మద్యం అందలేదని వీరంగం సృష్టించిన పలువురు ఐటీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్‌కు చెందిన ప్రసాద్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చైతన్య రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.
వీరు గురువారం రాత్రి ఫిలింనగర్ క్లబ్‌కు వచ్చి మద్యం తాగారు. నిబంధన ప్రకారం రాత్రి 10.30 గంటలకు క్లబ్‌లోని వైన్స్‌ను మూసివేశారు. 11.30 గంటల తర్వాత తమకు మద్యం కావాలని ఆ ముగ్గురూ అడిగారు. ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో వారిపై దాడి చేశారు. అంతేగాక ఫర్నీచర్ ధ్వంసం చేశారు. క్లబ్ మేనేజర్ శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

బ్యాటరీలో దొంగిలిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు
నగరంలో వేర్వేరు కళాశాలల్లో ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కొత్వాల్‌గూడలోని ఓ సెల్‌టవర్‌లో బ్యాటరీలు దొంగలించడానికి ప్రయత్నించి సెక్యూరిటీ గార్డుకు పట్టుబడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జబ్బార్ ఖాన్ బోయిన్‌పల్లిలోని మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు.
కిషన్‌బాగ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సత్తార్‌ఖాన్ కుమారుడు వికార్ సులేమాన్ చేవెళ్లలోని అల్‌హబీబ్ ఇంజినీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. కిషన్‌బాగ్‌లో ఉంటున్న మహ్మద్ వహీద్ ఇబ్రహీంపట్నం చైతన్య కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, వీరు ముగ్గురు కలిసి సెప్టెంబర్ 10న ఆరు బ్యాటరీలు దొంగిలించారు. వాటిని వాహనంలో తరలిస్తుండగా సెక్యూరిటీ గమనించి పట్టుకున్నాడు. అయితే ఆ ముగ్గురు సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. గ్రామస్తుల సహాయంతో సెక్యూరిటీ గార్డు నిందితులను పోలీసులకు అప్పగించాడు.












Click it and Unblock the Notifications