వందల కోట్ల అవినీతి! డీలిమిటేషన్ భేటీపై కిషన్ రెడ్డి సంచలనం
డీలిమిటేషన్ కు విధి విధానాలే ఇంకా ఖరారు కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరి తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్లుగా ఉందంటూ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ పై తొలి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) సమావేశం నిర్వహించడంపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

"... తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడులోని కొన్ని పార్టీలు ఈరోజు చెన్నైలో సమావేశం నిర్వహించారు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, డీఎంకె అయినా లేదా బిఆర్ఎస్ అయినా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై ఇంకా ఏదైనా చర్చ నిర్వహించిందా?' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
'తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 4.5 సంవత్సరాలుగా పాలిస్తూ అవినీతిలో పూర్తిగా మునిగిపోయారు ... రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీని నిందించడం ద్వారా పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ పేరుతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు . సమస్య డీలిమిటేషన్, మాతృభాష లేదా స్థానిక భాషనా? అని నేను ప్రజలను అడగాలనుకుంటున్నాను. బీజేపీ.. ప్రజలందరికీ, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంది' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తమిళనాడులో అధికార డీఎంకే, సీఎం స్టాలిన్ కుటుంబ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రూ. 700 కోట్ల లిక్కర్ స్కాం సహా వరుసగా కుంభకోణాలు బయటపడటం ఆ వ్యతిరేకతను పెంచుతున్నాయన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు జాతీయ విద్య విధానంలో త్రిభాషా సూత్రాన్ని చూపి, హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
#WATCH | Hyderabad: On Tamil Nadu Chief Minister MK Stalin holding the first Joint Action Committee (JAC) meeting on delimitation, Union Minister G. Kishan Reddy says, "...Tamil Nadu Chief Minister and some parties of Tamil Nadu have held a meeting in Chennai today. Be it… pic.twitter.com/0c3AKlGdLY
— ANI (@ANI) March 22, 2025
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డిలిమిటేషన్‌తో తమిళనాడు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ కృత్రిమ వాదాన్ని స్టాలిన్ తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు తదితర పక్షాలు తందానా అంటూ మద్దతు పలుకుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్న తమ ఆరోపణలు నిజమని ఈ భేటీతో మరోసారి నిరూపితమయ్యాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications