Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ పై జగ్గారెడ్డి అసంతృప్తి : వారిని కలుపుకుపోవాల్సిందే : కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్..!!

తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సొంత పార్టీలోని కొందరు నేతలు అసమ్మతిగా మారారు. కేంద్ర నాయకత్వం వద్దకు వారి వ్యవహార శైలిని ఇప్పటికే రేవంత్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. కానీ, వారు మాత్రం అవకాశం వచ్చిన ప్రతీ సందర్భాల్లోనూ రేవంత్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలి నుంచి రేవంత్ కు పీసీసీ పగ్గాలివ్వటం పైన అసంతృప్తితో కనిపిస్తున్నారు. పలు మార్లు కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ పైనే కాదు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ పైన ఆయన సంచలన ఆరోపణలు చేసారు.

అంతర్గతంగా రేవంత్ కు సమస్యలు..

అంతర్గతంగా రేవంత్ కు సమస్యలు..

ఇక, ఇప్పుడు బీజేపీ నేతలు పాదయాత్ర..అటు హుజూరా బాద్ విషయంలో కొంత ముందున్నట్లు కనిపిస్తున్నారు. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా ముందుకెళ్తున్న రేవంత్ కు ముందుగా సొంత పార్టీ నేతలను సముదాయించటానికే సమయం సరిపోతోంది. అందులో భాగంగా.. టీపీసీసీ తాజాగా కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం ఈసారి జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించారు. గజ్వేల్‌ సభ ఎజెండాగా సాగిన ఈ సమావేశంలో సభ నిర్వహించాల్సిన తీరుపైనే ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

జగ్గారెడ్డి సైతం రేవంత్ పైన అసంతృప్తి

జగ్గారెడ్డి సైతం రేవంత్ పైన అసంతృప్తి

ఈ సభకు అతిథు లను ఆహ్వానించే బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీలకు అప్పగించినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్‌ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సమష్టి కృషి ద్వారా సభను విజయవంతం చేయాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్‌ ఈ సమావేశంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశాన్ని ప్రస్తావించగా, గజ్వేల్‌ సభ ముగిసిన వెంటనే హుజూరాబాద్‌పై దృష్టి పెడదామని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సమయంలోనే..పార్టీ నేత జగ్గారెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారు.

హుజూరాబాద్ లో అభ్యర్ధి ఎంపిక ఎప్పుడు

హుజూరాబాద్ లో అభ్యర్ధి ఎంపిక ఎప్పుడు

రేవంత్ సైతం తన టీంలో జగ్గారెడ్డి కావాలని కోరుకున్నారు. అయితే, జగ్గారెడ్డి పలు సందర్భాల్లో ఓపెన్ గా రేవంత్ కు కొన్ని సూచనలు చేయటం... సద్దుబాటు చేసుకోవాల్సిన అంశాల పైన అందరి ముందు చర్చించటం రేవంత్ కు ఇబ్బందిగా మారింది. ఇక, తాజాగా జరిగిన సమావేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హాజరు కాలేదని సమాచారం.

దీని పైన ఆయన తన సన్నిహితులతో ముందుగానే చర్చించినట్లుగా చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా, హుజూరాబాద్‌ ఎన్నిక కీలకమైందని, ఇప్పటివరకు అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం సరైంది కాదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం.

ఆ ఇద్దరు ఎంపీలను దూరం పెడతారా

ఆ ఇద్దరు ఎంపీలను దూరం పెడతారా

దీంతో పాటు ప్రతి శనివారం జరిగే సమావేశానికి ప్రస్తుత కార్యవర్గ సభ్యు లతో పాటు పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల ను కూడా ఆహ్వానించాలని ఆయన గతంలో రేవంత్‌కు లేఖ రాశారు. కానీ, ఆ లేఖకు స్పందన లేకపోవడం కూడా జగ్గారెడ్డి అసంతృప్తికి మరో కారణమని తెలుస్తోంది. జగ్గారెడ్డి చెబుతున్న వారిలో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారిని ఆహ్వానించాలని..వారిని కలుపుకుపోవాలని రేవంత్ ను ఈ మధ్య కాలంలో జగ్గారెడ్డి పలు మార్లు సూచించారు.

కేసీఆర్ పాలన పైన ఛార్జ్ షీట్..

కేసీఆర్ పాలన పైన ఛార్జ్ షీట్..

అయినా..పీసీసీ నుంచి స్పందన రాకపోవటం తో భవిష్యత్ లో ఇది మరింత అసంతృప్తికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక, ఇదే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఏడేళ్ల వైఫల్యాలపై 'చార్జిషీట్‌'విడుదల చేయాలని టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం నిర్ణయించింది. ఈనెల 17న గజ్వేల్‌లో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో ఈ చార్జిషీట్‌ను ప్రజల ముందుంచాలని సమావేశంలో పాల్గొన్న నేతలు తీర్మానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+