కవితపై టీపీసీసీ అధ్యక్షుడు ఫైర్..ఉనికి కోసమే పోరాటం అంటూ ఆగ్రహం

బీసీ రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్కు వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించనున్నారు. అయితే కవిత చేస్తోన్న ధర్నాపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న ధర్నాపై విమర్శలు గుప్పించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచించడమే కాకుండా, వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా వారిని నిట్టనిలువునా ముంచిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్‌కు బీసీలు గుర్తుకొచ్చారని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు.

TPCC president Mahesh Kumar Goud is angry with BRS MLC kavitha

అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం. విజ్ఞులైన బీసీలు ఈ కుట్రలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యతిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందా..? అంటూ కవితను ప్రశ్నించారాయన. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతిచ్చారో బహిరంగ రహస్యమే అని . టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+