ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన ఎన్‌టిఆర్‌ను ముంచాడు, భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు

రాజకీయ అవసరాల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎన్‌టిఆర్, చంద్రబాబులను నట్టేట ముంచి టిఆర్ఎస్‌లోకి వెళ్ళారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: రాజకీయ అవసరాల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎన్‌టిఆర్, చంద్రబాబులను నట్టేట ముంచి టిఆర్ఎస్‌లోకి వెళ్ళారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో టీఆర్‌ఎస్‌ పాలకులు దోచుకుంటున్నారని భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు.

'గ్రామగ్రామాన తిరుగుతా... డబుల్‌బెడ్‌రూమ్‌, దళితులకు భూపంపిణీ, ఇంటికో ఉద్యోగం హామీల అమలుపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటా.. శాసనసభలో మీ సంగతి తేలుస్తా' అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tpcc working president Mallu Bhatti Vikramarka slams on Tummala Nageshwar rao

బోనకల్‌ మండలంలోని రాయన్నపేట గ్రామంలో సోమవారం రాత్రి పలు పార్టీలకు చెందిన నాయకులు భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత ఆళ్లపాడు గ్రామం నుంచి భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.

మూడున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకే తిరిగి గులాబీరంగులు వేసి తాము నిర్మించినట్టుగా టిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్‌, చంద్రబాబులను నట్టేట ముంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని దుయ్యబట్టారు.

నకిలీ విత్తనాలు సరఫరా జరుగుతుంటే విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. ఇద్దరు అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకొంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మధిర నియోజకవర్గంలో జాలిముడి ప్రాజెక్టు నిర్మించి 60గ్రామాలకు తాగునీటిని అందిస్తుండగా మిషన్‌ భగీరథ పేరుతో తామే నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారని భట్టి చెప్పారు.

English summary
Tpcc working president Mallu Bhatti vikramarka made allegations on minister Tummala Nageshwar rao. Mallu Bhatti Vikramarka participated a programme in Madhira assembly segment on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X