హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఈ విషయాలు తెలుసుకోండి..!
దసరా పండగకు వేళైంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండగను తమ ఇళ్లల్లో జరుపుకోవాలని నగరవాసులంతా పల్లెబాట పట్టారు.రేపు ఆదివారం సద్దుల బతుకమ్మ అలాగే సోమవారం మహర్నవమితో పాటు మంగళవారం విజయ దశమి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా నెలకొంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ పెరిగిపోయి 3 కిలోమీటర్ల నుంచి వాహనాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
చౌటుప్పల్ పట్టణాన్ని దాటాలంటే ఒక్కో వాహనదారుడికి దాదాపు 45 నిమిషాలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. రేపు ఉదయానికి ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు, ప్లై ఓవర్ పనులు సాగుతున్న క్రమంలో ట్రాఫిక్ భారీగా పెరుగుతోంది. ఇక సాధారణ రోజుల్లో కొద్ది నిమిషాల్లోనే దాటాల్సిన పంతంగి టోల్ గేట్ ను ఇప్పుడు దాటేందుకు గంటల సమయం పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లై ఓవర్ నిర్మాణం కారణంగా సర్వీస్ రోడ్డులోనే వాహనాలను నెమ్మదిగా పంపిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో గంటల తరబడి కూర్చోలేక కార్లు, బస్సుల్లోని ప్రయాణికులు, చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. టోల్ ప్లాజా వద్ద అదనపు రద్దీని నియంత్రించి వాహనాలు సజావుగా రోడ్డు దాటేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు 24 టోల్ బూత్ లలో 16 విజయవాడ వైపు తెరిచి ఉంచారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసే క్రమంలో కొన్ని వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు. ఇక పండగ సెలవులు పూర్తయ్యేంత వరకూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications
