డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు... పోలీసు స్టేషన్ ఎదుటే ఆత్మహత్య..!
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసుల చేతికి దొరికాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కాసేపటికే పోలీస్ స్టేషన్ ఎదుటే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని కుషాయిగూడలో ఈ దారుణమైన ఘటన జరిగింది.
హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికుల భద్రత కోసం నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం చూస్తుంటాం. దీంతో తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య క్రమంగా తగ్గుతుందని ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే హైదరాబాద్ లో దారుణమైన ఘటన జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఓ ఆటో డ్రైవర్.. పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. జవహర్ నగర్ కు చెందిన అమీన్ రెడ్డి అనే వ్యక్తి ఓ ఆటో డ్రైవర్. అయితే మంగళవారం సాయంత్రం ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి.. ఫుల్ గా తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు కాప్రాలోని కాల్ పబ్లిక్ స్కూల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంగా అటుగా వచ్చిన మీన్ రెడ్డిని పోలీసులు టెస్ట్ చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 120 పాయింట్లు రావడంతో మీన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లోనే ఉన్న మీన్ రెడ్డి.. అర్ధరాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడ్ని ఆస్పతికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అయితే మీన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మీన్‌రెడ్డి కుటుంబసభ్యులు మాత్రం.. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications