Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పకూలిన శిక్షణా విమానం - ఇద్దరు మృతి : నల్గొండలో కలకలం..!!

శిక్షణా విమానం కుప్పకూలిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఒక్క సారిగా స్థానికులు కలవరపాటుకు గురయ్యారు. పెద్ద శబ్దంతో ఈ ప్రమాదం జరగటంతో అక్కడే ఉన్న రైతులు ఆందోళన చెందారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా కింద పడటంతో తునాతునకలైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మహిళ పైలట్‌తో పాటు, ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో శిక్షణా విమానం కూలినట్లు అధికారులు గుర్తించారు.

విద్యుత్ స్తంభానికి డీకొని

విద్యుత్ స్తంభానికి డీకొని

దట్టమైన పొగలు వ్యాపించడంతో ఘటనా స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నారు. నాగార్జునసాగర్‌లో ఓ ఏవియేషన్‌ సంస్థ అకాడమీ నిర్వహిస్తోంది.. శిక్షణలో భాగంగా శనివారం ఉదయం నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్‌నుంచి బయల్దేరిన విమానం ప్రమాదానికి గురైంది. పెద్ద శబ్ధంతో విమానం పేలిందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దీనిని స్థానిక అధికారులు ఏవియేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

భారీ శబ్దంతో పేలుడు.. కేకలు

భారీ శబ్దంతో పేలుడు.. కేకలు

కాగా, ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా 152 మోడల్ టూ సీటర్ చాపర్‌ గా గుర్తించారు. నాగార్జున సాగర్ ఎయిర్‌ బేస్‌ నుంచి టేకాఫ్ హెలికాప్టర్ సాంకేతిక సమస్యలతో కూలింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అయితే, ప్రమాదం పైన స్థానికంగా పని చేసుకుంటున్న రైతులు వివరించే ప్రయత్నం చేసారు. తాము పొలం పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపడినట్లు పెద్ద శబ్ధం వచ్చిందని చెప్పారు. ఏమైందోనని చూసేసరికి మా పొలాలకు సమీపంలో ఓ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడం కనిపించిందన్నారు.

తమిళనాడు మహిళా పైలైట్ గుర్తింపు

తమిళనాడు మహిళా పైలైట్ గుర్తింపు

ఎవరిదైనా పంట కాలిపోతుందేమోనని పరుగున అక్కడికి వెళ్లామని,,. చూసేసరికి ఓ విమానం దగ్ధమవుతోందని వివరించారు. అందులో నుంచి అరుపులు వినిపించాయని.. ఏం చేయాలో అర్థమయ్యేలోగానే.. అరుపులు రావడం ఆగిపోయాయని వివరించారు. అప్పటికే అందులో ఉన్న వాళ్లు కాలిపోయి ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన మహిళా పైలట్ మహిమ మరణించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి నిర్ధారించారు. ఘటనాస్థలిలో పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది సహాయచర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+