• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో తెలంగాణలో అల్లర్లు?

|
Google Oneindia TeluguNews

ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో ఏదో అలజడి సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీన హైదరాబాదులో తలపెట్టనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంపై గులాబీ నేతలు స్పందించారు. ఎవరెన్ని సమావేశాలు సభలు పెట్టినా ప్రజలు మాత్రం సీఎం కేసీఆర్ పాలనకే మొగ్గు చూపుతున్నారన్నారు.

9 సంవ‌త్స‌రాల నుంచి అభివృద్ధి ప‌థంలో తెలంగాణ‌

9 సంవ‌త్స‌రాల నుంచి అభివృద్ధి ప‌థంలో తెలంగాణ‌

భారతీయ జనతాపార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న నాయకులకు, నేతలకు తెలంగాణ‌కు సంబంధించి కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో నరేంద్రమోడీ, అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తొమ్మిది సంవ‌త్స‌రాల నుంచి తెలంగాణ వ‌రుస‌గా అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది.

ఐటీ మంత్రి కేటీఆర్ ప్ర‌పంచంలో ఎక్క‌డ ఆర్థిక వేదిక స‌ద‌స్సులు జ‌రిగినా వెళ్లి హైద‌రాబాద్‌కు ల‌క్షల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు తీసుకువ‌స్తున్నారు. హైద‌రాబాద్ ఇప్ప‌టికే విశ్వ‌విఖ్యాత న‌గ‌ర‌మైంది. రాష్ట్ర‌మంతా మిష‌న్ కాక‌తీయ పేరుతో చెరువులు త‌వ్వించి స‌మృద్ధిగా నీరు అందుబాటులో ఉండేట‌ట్లు చూడ‌ట‌మైంది. ద‌ళిత బంధు పేరుతో ద‌ళితుల‌ను వ్యాపార‌వేత్త‌ల‌ను చేసే ప‌ని చురుగ్గా సాగుతోంది. కాళేశ్వ‌రం లాంటి ప్రాజెక్టుల‌తో తెలంగాణ నిండు కుండ‌లా ఉంది. వేలాది ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ద‌క్షిణాది ప‌న్నుల‌తో ఉత్త‌రాదిని అభివృద్ధి చేస్తున్నారు!!

ద‌క్షిణాది ప‌న్నుల‌తో ఉత్త‌రాదిని అభివృద్ధి చేస్తున్నారు!!

అయితే రాష్ట్ర‌మంతా ప‌చ్చ‌గా ఉన్న త‌రుణంలో మీరు ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి మ‌తం అనే ఆయుధాన్ని ప్ర‌యోగించేందుకు సిద్ధమవుతున్నారని గులాబీ దళం నిప్పులు చెరిగింది. మ‌తం అనేది ఉత్త‌రాదిలో బీజేపీ వారికి ఏమైనా క‌లిసి వ‌స్తుందేమోకానీ ద‌క్షిణాదిలో క‌లిసిరాదని హితవు పలికారు. ఇక్క‌డ కావ‌ల్సింది కేవ‌లం అభివృద్ధి, సంప‌ద సృష్టి. ఇప్ప‌టికే ద‌క్షిణాది రాష్ట్రాలు క‌డుతున్న ప‌న్నుల్లో ఎక్కువ భాగంగా ఉత్త‌రాదికి కేటాయించుకొని అక్క‌డి రాష్ట్రాల్లో బీజేపీని బ‌లోపేతం చేసుకునే కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మ‌న పెద్ద‌లు చెప్పిన మాట‌ను పెడ‌చెవిన పెట్ట‌కూడ‌దు!

మ‌న పెద్ద‌లు చెప్పిన మాట‌ను పెడ‌చెవిన పెట్ట‌కూడ‌దు!

తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డానికి కమలం పార్టీ అంత‌గా త‌హ‌త‌హ‌లాడాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది గులాబీనేతల అభిప్రాయం. దుబ్బాక‌లో గెలిచారంటే కారును పోలిన రోలింగ్ గుర్తు వాహ‌నానికి 35వేల ఓట్లు వ‌చ్చాయని గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీ అభ్యర్థి మెజారిటీ వెయ్యేక‌దా?? అని ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో గెలిచారంటే గెలిచామ‌నిపించుకున్నారు తప్ప వాపును చూసి బలుపనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంద‌ర్భంగా జులై మూడోతేదీన భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసి ప్రధాని మోదీ ప్ర‌సంగించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. భావోద్వేగాల‌ను పండించ‌డంలో, భావోద్వేగాల‌ను ర‌గిలించ‌డంలో బీజేపీ వారు తమకు తామే సాటి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారని టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తెలంగాణ గురించి పూర్తి వాస్తవాలను తెలుసుకొని పోటీలోకి దిగితే కాస్తంత పరువు పోకుండా ఉంటుందని హితవు చెబుతోంది.

English summary
TRS alleges violence may be provoked in the name of BJPs National Executive meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X