బండి భగీరథ్ పోక్సో కేసు.. లుకౌట్ నోటీసులు ఇవ్వాలన్న కవిత
తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ దేశం వదిలి వెళ్లిపోకుండా తక్షణం లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కవిత పోలీసు యంత్రాంగాన్ని కోరారు.
బీజేపీ పాలనలో నేరస్తులు దేశం దాటిపోయే సంఘటనలు
ఇలా చేస్తే మాత్రమే విచారణ పారదర్శకంగా జరుగుతుందని, తెలంగాణ మహిళలకు న్యాయం అందుతుందని విశ్వాసం కలుగుతుందని ఆమె అన్నారు. బీజేపీ పాలనలో నేరస్తులు దేశం దాటిపోయే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని కవిత తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర మంత్రి కుమారుడు ఇలాంటి తీవ్ర నేరం చేసినా ప్రభుత్వం రక్షిస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు
బండి భగీరథ్ పోక్సో కేసులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపి బాధిత మైనర్ బాలిక ఫోటోలు, వివరాలు వైరల్ చేయడం తప్పని కవిత మండిపడ్డారు. ఒక బాలిక జీవితాన్ని నాశనం చేసే విధంగా ప్రచారం చేయడం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇలాంటి అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసి, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయాలని పోలీసులకు కవిత విజ్ఞప్తి చేసారు.
తెలంగాణలో పొదుపు సూత్రాలు చెప్పి, ఆంధ్రప్రదేశ్‌కు నిదులిచ్చిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పొదుపు సూత్రాలు చెప్పి, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారని కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కనీసం మాట కూడా మాట్లాడలేదని కవిత విమర్శించారు. జనగణన విషయంలో కులం, ఉపకులాలు, సామాజిక స్థితి-గతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కవిత వ్యాఖ్యలతో తెలంగాణా ప్రభుత్వం పై ఒత్తిడి
ఇళ్ల లెక్కలు పూర్తి కావడంతో జనగణన త్వరలో జరగాలని, ఓబీసీలకు సరైన రిజర్వేషన్ లభించాలని ఆమె అన్నారు. కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బండి భగీరథ్ పోక్సో కేసుపై కవిత స్పందించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భగీరథ్ ను అరెస్ట్ చెయ్యాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న సమయంలో తెలంగాణా ప్రభుత్వం పైన కూడా ఈ విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.













Click it and Unblock the Notifications