• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.!మంత్రుల రియాక్షన్ ఇదే.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : స్థానిక సంస్దల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ విజయఢంకా మోగించింది. ఆరు స్థానాలకు గానూ మొత్తం ఆరు స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో పాటు రాష్ట్ర మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ అభ్యర్థుల గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెంటే ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ అంశాన్ని రుజువు చేసాయని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ గెలిచిన అభ్యర్ధుల గురించి స్పందించారు.

తిరుగులేని ఆదరణ.. కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలన్న కల్వకుంట్ల కవిత..

ముందుగా సీఎం తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సహచర టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపితమైందని, ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారుని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందనన్న అంశం ఈ ఫలితాలతో మరోసారి ఋజువైందని కవిత అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కవిత.

కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష. గులాబీ ప్రభంజనమన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష. గులాబీ ప్రభంజనమన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని నూటికి నూరు శాతం టిఆర్ఎస్ గెల్చుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొత్తం ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరింటిని భారీ ఓట్ల మెజారిటీతో గెలవడం టిఆర్ఎస్ పార్టీపై ఉన్న ఆదరణ తెలియజేస్తున్నదన్నారు. టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహ రచన, పార్టీ శ్రేణుల కృషితో ఇంతటి ఘన విజయాలు సొంతమయ్యాయని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర్ రావే శ్రీరామ రక్ష అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలు గా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు,ఎల్.రమణ,దండె విఠల్,యాదవరెడ్డి, కోటిరెడ్డి,తాత మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతిపక్షాలకు స్థానం లేదు..ఇండిపెండెంట్ లు బొక్కబోర్లా పడ్డారన్న మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతిపక్షాలకు స్థానం లేదు..ఇండిపెండెంట్ లు బొక్కబోర్లా పడ్డారన్న మంత్రి జగదీష్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారని, కోటిరెడ్డి కి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, మంత్రి కేటీఆర్ కు మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కోటిరెడ్డి కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెరు పెరు న కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. ఇది సమిష్టి విజయమని,
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్నో కుయుక్తులు పన్నాయని, ఇండిపెండెంట్ లుగా తమ అభ్యర్థులను నిలబెట్టి బొక్క బోర్లా పడ్డాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
గులాబీ సైనికుల శక్తి ముందు కాంగ్రెస్ పలాయనం చిత్తగించింది. ఈ విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెంటే ఉందని అని మరోసారి రుజువు అయిందని, మరో సారి నల్గొండ జిల్లా గులాబీ కంచు కోట అని నిరూపితం అయిందని అన్నారు.

టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి.. ఫలితాలు ఐక్యతను చాటాయన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి.. ఫలితాలు ఐక్యతను చాటాయన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని, అంటే నూటికి నూరు శాతం టిఆర్ఎస్ గెల్చుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరింటిని భారీ ఓట్ల మెజారిటీతో గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు కొప్పుల ఈశ్వర్. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలు గా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు, యల్ రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యావత్తు ప్రజానీకం టిఆర్ఎస్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్

విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు.. కాంగ్రెస్, బీజేపీలు ఊహల్లో జీవిస్తున్నాయన్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు.. కాంగ్రెస్, బీజేపీలు ఊహల్లో జీవిస్తున్నాయన్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆద‌ర‌ణ‌ ఉందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక‌లు ఏవైనా టీఆర్ఎస్ దే విజయమన్నారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్. ప్ర‌జాప్ర‌తినిదులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఈ సందర్బంగా ద‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. స‌మిష్టి కృషితోనే ఎమ్మ‌ల్సీగా దండే విఠ‌ల్ గెలుపోందారని అన్నారు. విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టని, కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై పోటీకి దిగినా సొంత ఓట్లు తెచ్చుకోలేకపోయారని, ఆరు స్థానాలలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఊహల్లో జీవిస్తున్నాయని, 12కు 12 ఎమ్మెల్సీ స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం అనుదైన సంఘటన అన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణం.. టిఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనమన్న మంత్రి ఎర్రబెల్లి

క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణం.. టిఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనమన్న మంత్రి ఎర్రబెల్లి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనమన్నారు మంత్రి దయాకర్ రావు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని, శాసన మండలిలోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికలలో మొత్తం 12 స్థానాలు గెలవడం, క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణమన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరింటిని భారీ మెజారిటీతో గెలవడం టిఆర్ఎస్, సీఎం చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల నాయకత్వం పట్ల, వారి పరిపాలనా పటిమ పట్ల ప్రజల మన్ననలను నిదర్శనమన్నారు ఎర్రబెల్లి.

ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ కు కొండంత అండ. మరింత ఉత్సాహంగా పని చేస్తామన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ కు కొండంత అండ. మరింత ఉత్సాహంగా పని చేస్తామన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలు గా ఘన విజయం సాధించిన అభ్యర్థులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అలాగే గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు నిరంజన్ రెడ్డి. రాష్ట్ర ప్రజానీకం యావత్తు టిఆర్ఎస్, సీఎం చంద్రశేఖర్ రావు వెంటే ఉన్నారని మరోసారి రుజువైందని అన్నారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ ప్రముఖులకు, నాయకులకు, శ్రేణులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు మంత్రి. ఈ విజయాలతో మరింత ఉత్సాహం తో ప్రజలకు సేవ చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ కు కొండంత అండ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్..

ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదేనని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. స్థానిక సంస్థలకు జరిగిన 12 స్థానాలకు 6 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, నేడు ఎన్నిక జరిగిన మరో ఆరుగురు అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా, ఓట్లు వేసి టి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి మద్దతు పలికిన స్థానిక సంస్థల సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.

English summary
The ruling trs Party has emerged victorious in the local body quota MLC elections. The TRS party won a total of six seats out of a possible six. This created excitement in the party ranks. Along with the mlc Kalvakuntla Kavitha,state ministers are elated over the victory of the pink candidates in the local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X