రాజగోపాల్ రెడ్డి సంచలనం.. ఫలితాల మరునాడే ప్రభుత్వం పడిపోతుందట
మునుగోడు బై పోల్ హీటెక్కిస్తోంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే తాయిలాలు కూడా ప్రకటించారు. విజయంపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాతో ఉన్నారు. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రోజే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన వారు ఒకరి తర్వాత ఒకరు జైలుకు వెళ్తారన్నారు. 13 ఏళ్ల నుంచి తమ కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నానని... కాంట్రాక్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టుపై టీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్‌కు బుద్ధి వచ్చేలా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన ధర్మయుద్ధం మునుగోడు ఉప ఎన్నిక అని వివరించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పదవీ త్యాగం చేశానని గుర్తుచేశారు. రాజకీయంగా తనపై ఎంత దుష్ప్రచారం చేసినా మునుగోడు ప్రజలు విశ్వసించరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.
బై పోల్ కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపాయి. ఉప ఎన్నికలో విజయం తమకు అత్యవసరం అని ముఖ్య నేతలు భావిస్తున్నారు. గెలుపొందేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నారు. అన్నీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications