ఎర్రబెల్లి కాన్వాయ్‌లో ప్రమాదం, సురక్షితంగా దయాకర్‌రావు

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్:టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు సురక్షితంగా తప్పించుకొన్నారు. సంఘటనాస్థలాన్ని దయాకర్‌రావు పరిశీలించారు.

జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కడవెండి నుంచి మాదాపురంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

TRs Mla Errabelli Dayakar rao safely escapes from accident

దయాకర్‌రావు కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీకొట్టాయి. మార్గమధ్యంలో కాన్వాయ్‌ లోని ఒక కారు మరొక కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు చెరువులో బోల్తాపడ్డాయి.

ఇందులోని ఒక కారులో జీసీసీ ఛైర్మన్‌ దరావత్‌ మోహన్‌ గాంధీ నాయక్‌ ఉన్నారు. ప్రమాదంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి.

వారిద్దరినీ హుటాహుటీన జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే దయాకర్‌రావు ప్రయాణీస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. దీంతో ఆయన సురక్షితంగా ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Trs mla Errabelli Dayakar rao sefely escaped from accident on Monday in Jangoan district.Two vehicles fell down in a lake. Two persons injured, Dayakar rao safely escaped this accident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి