ఎంపీ మల్లారెడ్డికి పాలాభిషేకం: వీడియో వైరల్, నెటిజన్ల సెటైర్లు(వీడియో)

హైదరాబాద్: మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన అభిమానులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు వారు చేశారంటే.. తమ అభిమాన నేతకు పాలాభిషేకం చేయడమే కారణం.
గులాబీలో అసమ్మతి సెగలు: ఎర్రబెల్లిపై తక్కెళ్లపల్లి సంచలన వ్యాఖ్యలు, మరికొన్ని స్థానాల్లోనూ
వివరాల్లోకి వెళితే.. పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీలో కూర్చున్న మల్లారెడ్డికి పాలాభిషేకం చేశారు ఆయన అభిమానులు. బకెట్ నిండా పాలు తెచ్చి.. చెంబులతో ఆయనపై పోస్తూ.. పాలతోనే స్నానం చేయించారు. అనంతరం పూజారి ఆయనపై అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.
మల్లారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అభి మానులు ఈ విధంగా పాలాభిషేకం చేశారు. అయితే, ఈ పాలాభిషేకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తలుView All
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!