వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు కర్నాటక అక్రమ ప్రాజెక్టుల గోల! బాబు 'చండీగఢ్'పై వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సోడా నీళ్ల పైన పెట్టే శ్రద్ద ప్రజల తాగునీటి పైన పెడితే బాగుంటుందని తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.

అలమట్టి మరో బాబ్లీ ప్రాజెక్టుగా మారుతోందని హెచ్చరించారు. కర్నాటక అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే టిఆర్ఎస్ సర్కార్ కళ్లు మూసుకొని కూర్చుందన్నారు. అలమట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు కృష్ణా నీరు చుక్కరాదన్నారు.

టిఆర్ఎస్ ఎంపీలకు సొంత పైరవీల పైనే శ్రద్ధ అని మండిపడ్డారు. త్వరలో ఢిల్లీ వెళ్లి తాము ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. సోడా నీళ్ల పైన పెట్టే శ్రద్ద కెసిఆర్ ప్రజల తాగునీటి పైన పెట్టాలన్నారు.

ఉద్యమంలో ఉన్నప్పుడు నీళ్లు, నిధులు అని చెప్పి ఇప్పుడు నా కుటుంబం, నేను అంటున్నారని ఎద్దేవా చేశారు. చండీగఢ్ గురించి చంద్రబాబు చెప్పింది వేరు, టిఆర్ఎస్ నేతలు చెబుతోంది వేరన్నారు. చంద్రబాబు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని టిఆర్ఎస్ చెప్పగలదా అని సవాల్ చేశారు.

కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు తెరలేపిందన్నారు. 519 అడుగుల ఎత్తును 524కు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భూసేకరణకు కర్నాటక నోటిఫికేషన్ విడుదల చేసిందని, ప్రభుత్వం ఇకనైనా పట్టించుకవాలన్నారు.

'TRS must respond on Karnataka illegal projects'

194 గేట్లతో బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైందన్నారు. కర్నాటకలో అక్రమ ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. తాము చెబుతున్నామని ప్రతిష్టకు పోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.

స్వచ్ఛ హైదరాబాదును నామమాత్రంగా నిర్వహించారు: డికె అరుణ

టిఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాదును నామమాత్రంగా నిర్వహించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. సర్వేలో హైదరాబాదుకు 275వ స్థానం రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవంతికి ఢోకా లేదని ఇంటాక్ కమిటీ తేల్చి చెప్పిందన్నారు. దాని కూల్చివేతను విరమించుకొని మరమ్మత్తులు చేయాలన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల విషయంలో కెసిఆర్ అప్రజాస్వామికంగా: మల్లేష్

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో సిఎం కెసిఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ నేత గుండా మల్లేష్ అన్నారు. డిజైన్ మార్చొద్దని అఖిల పక్షం నేతలు కెసిఆర్‌ను కలవాలని సూచించారు. డిజైన్ మార్చడటం వల్ల రంగారెడ్డి, హైదరాబాదుకో కాకుండా అదిలాబాద్ జిల్లాకూ అన్యాయం జరుగుతుందన్నారు. కెసిఆర్ వినకుంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలుస్తామన్నారు.

English summary
TRS government must respond on Karnataka illegal projects, says Telangana TDP leader Errabelli Dayakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X