తెలుసుకో, రాజకీయం లేదు: జిగ్నేష్ మేవానీపై పిడమర్తి రవి ఆగ్రహం
హైదరాబాద్: గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మండిపడ్డారు. తెలంగాణ గురించి కనీస అవగాహన లేదనీ, కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు విని ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు.
ఇటీవల మేవానీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిడమర్తి రవి మాట్లాడారు. రాష్ట్రంలో సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా జిగ్నేశ్ ఇక్కడికి వచ్చి పోలీసు రాజ్యం నడుస్తోందని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. మందకృష్ణ అంబేడ్కర్ సిద్ధాంతాన్ని వదిలి దాడులకు పూనుకుంటుంటే, జిగ్నేశ్ వచ్చి మద్దతు తెలపడం దారుణమన్నారు.
మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ గురించి కాకుండా, వ్యక్తిగత ఎజెండాతో పోతున్నారన్నారు. ఆయనతో వర్గీకరణ సాధ్యంకాదని దళితులందరికీ తెలిసిపోయిందనీ, అందుకే తామంతా వర్గీకరణ కోసం పోరాడుతున్నామన్నారు. జిగ్నేశ్‌ను ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కలవడంలో రాజకీయం లేదనీ, గురుకులాల సమాచారం కోరడంతో ఆయనకు ఇచ్చారన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications